Begin typing your search above and press return to search.

మొహెంజదారో.. పూజా భలే బాగుందిరో

By:  Tupaki Desk   |   16 Jun 2016 6:42 AM GMT
మొహెంజదారో.. పూజా భలే బాగుందిరో
X
సౌత్ సుందరి పూజా హెగ్డే తమిళ్ లో ఓ సినిమా - తెలుగులో రెండు సినిమాలు చేసిందంతే. ఒకేసారి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చేయడంతో.. అమ్మడి అదృష్టానికి చాలామంది కుళ్లుకున్నారు. ఏకంగా హృతిక్ రోషన్ సరసన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మొహెంజదారో చిత్రంలో లీడ్ హీరోయిన్ ఆఫర్ పట్టేయడం చాలామందికి మింగుడు పడలేదు. ముకుంద మూవీలో వరుణ్ తేజ్ సరసన నటించిన ఈ చిన్నదాన్ని.. 'చాని' అనే రోల్ కు మొహెంజదారో టీమ్ ఎందుకు ఎంపిక చేసిందో.. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతుంది.

తన కెరీర్ మొత్తంలో ఇదే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం అవుతుందని హృతిక్ ఆశిస్తున్నాడంటే.. దీనిపై ఉన్న అంచనాలను అర్ధం చేసుకోవచ్చు. చానీ గా పూజా హెగ్డే నటిస్తుండగా.. ఆ పాత్రకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ అద్దిరిపోయింది. బ్లూ అండ్ మెరూన్ కలర్ ఔట్ ఫిట్స్.. క్లీవేజ్ ను ఎక్స్ పోజ్ జేస్తూ డ్రెసింగ్.. జుట్టును రెండు వైపులా లూజ్ గా వదిలేసిన గెటప్.. తలపై కిరీటం లాంటి పాగా.. కొన్ని శతాబ్దాలకు పూర్వం నేలపై నడించిన ఓ మహారాణి అనే ఫీలింగ్ ని.. ఫోటో చూడగానే కలిగించింది పూజా హెగ్డే.

ఈ పాత్రకు తాను పర్ఫెక్ట్ ఛాయిస్ అని మొదటి లుక్ తోనే ప్రూవ్ చేసుకోవడంతో.. పూజాపై ఇప్పుడు బాలీవుడ్ కి కాన్ఫిడెన్స్ పెరిగిపోతోంది. ఆడియో-శాటిలైట్ హక్కులను 60కోట్లకు అమ్ముడు పోయి మొహెంజదారో ఇప్పటికే సెన్సేషన్ సృష్టించగా.. ప్రీ రిలీజ్ బిజినెస్ 200కోట్లకుపైగా జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. సినిమా కనుక హిట్ అయితే.. అమ్మడి ఫేట్ కంప్లీట్ గా మారిపోయినట్లే.