Begin typing your search above and press return to search.

శివరాత్రి సినిమాలలో ఏవి ఆడియన్స్ ని మెప్పించాయి..?

By:  Tupaki Desk   |   11 March 2021 5:30 PM GMT
శివరాత్రి సినిమాలలో ఏవి ఆడియన్స్ ని మెప్పించాయి..?
X
టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి మొదలుకొని ప్రతి వారం థియేటర్స్ అన్నీ సందడిగా మారుతున్నాయి. కరోనా పరిస్థితుల నుంచి బయటపడి సాదారణ స్థితికి వస్తుండటంతో మేకర్స్ పోటీపడి సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహా శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. శర్వానంద్ 'శ్రీకారం' - నవీన్ పోలిశెట్టి 'జాతిరత్నాలు' - శ్రీవిష్ణు 'గాలి సంపత్' - కన్నడ డబ్బింగ్ మూవీ 'రాబర్ట్' ఈరోజు విడుదలయ్యాయి. తొలి రోజు టాక్ ని బట్టి వీటిలో ఏవి ఆడియన్స్ ని మెప్పించాయో చూద్దాం.

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి సూపర్ హిట్ తర్వాత నవీన్ నటించిన ''జాతిరత్నాలు'' సినిమాపై ముందు నుంచే బజ్ ఉంది. వెరైటీ ప్రమోషన్స్ తో జనాలను అట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చెప్పుకోదగ్గ క‌థ కాకపోయినప్పటికీ కామెడీ బాగా వర్కౌట్ అవ్వ‌డంతో 'జాతిర‌త్నాలు' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స్ట‌డీగా నిల‌బ‌డే అవ‌కాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. టాక్ ని బట్టి చూస్తే ఈ వీకెండ్ రేసులో 'జాతిర‌త్నాలు' కమర్షియల్ గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

వర్సటైల్ హీరో శర్వానంద్ నటించిన ''శ్రీకారం'' సినిమా కూడా ఫస్ట్ మంచి టాక్ తెచ్చుకుంది. వ్యవసాయం - రైతుల ప్రాధాన్యతను తెలియజెప్పేలా సందేశాత్మక అంశాలతో రూపొందిన ఈ సినిమా కొన్ని ఏరియాలలో 'జాతిరత్నాలు' కంటే ముందుంది. ఫస్ట్ హాఫ్ లో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయిందని.. సెకండ్ హాఫ్ ల్యాగ్ అవకుండా ఉంటే ఇంకా బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. కానీ కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి - 14 రీల్స్ వారు చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీకెండ్ లో 'శ్రీకారం' మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ''గాలి సంపత్'' స్లో గా స్టార్ట్ అయినప్పటికీ మ్యాట్నీ షో నుంచి పుంజుకుందని అంటున్నారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరియు శ్రీవిష్ణు నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తం మీద ఫస్ట్ డే కొన్ని చోట్ల 'జాతిర‌త్నాలు' స్థానంలో 'శ్రీకారం' నిలిస్తే.. మ‌రికొన్ని చోట్ల 'గాలి సంప‌త్' నిలిచిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక డబ్బింగ్ సినిమా 'రాబర్ట్' సందడి ఎక్కడా కనిపించలేదు. 'శ్రీకారం' 'గాలి సంపత్' సినిమాలు రెండూ ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసి తెర‌కెక్కించిన సినిమాలు కావ‌డంతో యూత్ ఆడియన్స్ 'జాతిరత్నాలు' వైపు వెళ్లారని తెలుస్తోంది. అయితే వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్లో ఉంటుంది కాబట్టి ఈ సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.