Begin typing your search above and press return to search.

పబ్లిక్ ఒపీనియన్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరంటే..?

By:  Tupaki Desk   |   20 May 2021 3:31 PM GMT
పబ్లిక్ ఒపీనియన్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరంటే..?
X
మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండే చిత్ర పరిశ్రమలో ఎంతటి టాలెంటెడ్ బ్యూటీ అయినా కొంతకాలం మాత్రమే హీరోయిన్ గా హవా చూపించగలదు. అందులోనూ రోజుకో కొత్త భామ అడుగుపెడుతున్న ఈ రంగుల ప్రపంచంలో పోటీని తట్టుకొని అవకాశాలు అందిపుచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా ఒక అర డజను మందిని మాత్రమే స్టార్ హీరోయిన్స్ గా పరిగణిస్తున్నారు. వారి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రెజెంట్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరనే దానిపై ప్రేక్షకుల అభిప్రాయంతెలుసుకోడానికి 'తుపాకీ డాట్ కామ్' ఓ పోల్ పెట్టింది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నట్లు అర్థం అవుతోంది. మొత్తం పోలైన ఓట్లలో 42.64% మంది పూజాకు మద్దతుగా నిలిచారు. స్టార్ హీరోలందరి సరసన అవకాశాలు అందుకున్న పూజా.. ప్రస్తుతం తెలుగులో 'రాధే శ్యామ్' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలు చేస్తోంది. ఇక కోలీవుడ్ - బాలీవుడ్ లోనూ ఆఫర్స్ అందుకుంటోంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా 20.30% ఓట్లతో రెండో స్థానంలో ఉంది. తెలుగులో ప్రస్తుతం 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాతో పాటుగా 'ఆడాళ్లు మీకు జోహార్లు' అనే సినిమా చేస్తోంది రష్మిక. ఇటీవలే కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టి, శాండిల్ వుడ్ - బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.

డ్యాన్స్ లతో పాటు తన నేచురల్ పర్ఫార్మన్స్ తో ఫిదా చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్న సాయిప‌ల్ల‌వికి ఈ పోల్ లో 17.04% ఓట్స్ వచ్చాయి. దక్షిణాది భాషల్లో వరుస ఆఫర్స్ అందుకుంటున్న సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగులో 'లవ్ స్టోరీ' 'విరాటపర్వం' 'శ్యామ్ సింగ రాయ్' వంటి సినిమాలు చేస్తోంది. ఇక కొన్నేళ్ల పాటు టాలీవుడ్ టాప్ లీగ్ లో కొనసాగుతున్న సమంత అక్కినేని కి ఇందులో 15.88% ఓటింగ్ వచ్చింది. 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న సామ్.. 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తోంది.

ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తున్న నిధి అగర్వాల్ కు ఈ పోల్ లో 3.11 శాతం ఓట్లు వచ్చాయి. నిధి ప్రస్తుతం గల్లా జయదేవ్ డెబ్యూ మూవీతో పాటుగా 'హరి హర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ 1.03% ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. రకుల్ తెలుగులో పంజా వైష్ణవ్ తేజ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సత్తా చాటుతున్న అప్ కమింగ్ హీరోయిన్లలో ఎవరెవరు రాబోయే రోజుల్లో టాప్ లీగ్ లోకి చేరతారో చూడాలి.