Begin typing your search above and press return to search.

బస్సులపై హాట్ పోస్టర్లతో రచ్చవుతోంది

By:  Tupaki Desk   |   31 Jan 2018 10:12 AM GMT
బస్సులపై హాట్ పోస్టర్లతో రచ్చవుతోంది
X
అర్జున్ రెడ్డి సినిమాకు ముందే వివాదాల‌ను నెత్తినేసుకుంది. హైద‌రాబాద్‌లోని బ‌స్సుల‌పై అర్జున్ రెడ్డిలోని లిప్ లాక్ సీన్ల పోస్ట‌ర్ల‌ను ప్ర‌చురించ‌డం పెద్ద ర‌చ్చే అయింది. కాంగ్రెస్ నేత వీహెచ్ అయితే నేరుగా సినిమాపై విమ‌ర్శ‌లు చేశారు. పోస్ట‌ర్ల‌ను చింపేయ‌మంటూ పిలుపునిచ్చాడు. ఇంత ర‌చ్చ జ‌రిగినా అర్జున్ రెడ్డి కూల్‌గా హిట్ కొట్టింది. ఇప్పుడు అదే దారిలో పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది హౌరా బ్రిడ్జి.

చిన్న సినిమాకు ఎక్కువ ప‌బ్లిసిటీ కావాలంటే ఏదో ఒక ర‌చ్చ జ‌ర‌గాల్సిందే. అందుకేనేమో హౌరా బ్రిడ్జ్ టీమ్ అర్జున్ రెడ్డిని ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. బ‌స్సుల‌పై హీరో హీరోయిన్ల హాట్ సీన్ల పోస్ట‌ర్ల‌ను అంటించింది. ఆ ముద్దు సీన్లు, రొమాంటిక్ స‌న్నివేశాలు యువ‌త‌ను ఆక‌ర్షించ‌డం ఖాయం అని వారి భావ‌న‌. బ‌స్సులను కూడా వ‌ద‌ల‌డం లేదు సినిమా వాళ్లు అని విమ‌ర్శించే వాళ్లు ఉన్నారు. ముఖ్యంగా విజ‌య‌వాడ నుంచి వ‌చ్చే వాళ్లు మాత్రం ఆ పోస్ట‌ర్ల‌ను చూసి బాగా విస్తుపోతున్నారు. ఆర్టీసీ బ‌స్సును ఇలా సొంత అవ‌స‌రాల‌కు ఎలా వాడుకుంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్ర‌భుత్వం క‌ల్పించుకుని... ఇలాంటి పోస్ట‌ర్లు అంటిస్తున్న వారిపై లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

బూచమ్మ బూచోడు సినిమా డైరక్టర్ రెవాన్ యాదు తీసిన హౌరా బ్రిడ్జ్ ఫిబ్రవరి 3న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈలోపే ప‌బ్లిసిటీ కోసం చేత‌నైనంత చేస్తోంది చిత్ర యూనిట్‌. ఇందులో అందాల రాక్షసిఫేం రాహుల్ ర‌వీంద్ర‌న్ హీరోగా చేస్తుంటే... యూట్యూబ్ స్టారీమణి చాందినీ చౌద‌రి హీరోయిన్‌గా చేస్తోంది.