Begin typing your search above and press return to search.

టీజర్ టాక్‌: అది మిస్సయ్యింది గరుడ వేగ

By:  Tupaki Desk   |   22 Sept 2017 7:06 PM IST
టీజర్ టాక్‌: అది మిస్సయ్యింది గరుడ వేగ
X
రాజశేఖర్ హీరోగా 'గుంటూర్ టాకీస్' ఫేం ప్రవీణ్‌ సత్తారు డైరక్షన్లో వస్తున్న సినిమా ''గరుడవేగ''. ఈ సినిమాలో ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తాలూకు కథను చెప్పబోతున్నారని ఆల్రెడీ ఎప్పుడో చెప్పిందే. అయితే ఎట్టకేలకు ఈ సినిమా టీజర్ ను ఈరోజు విడుదల చేశారు.

ఒక్కసారి టీజర్ ను చూస్తే మాత్రం.. ఇది ఖచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్ లో తీసిన సినిమా అనుకోవచ్చు మనం. ముఖ్యంగా ఫారిన్ లొకేషన్లలో తీసిన యాక్షన్ సీన్లన్నీ కూడా హాలీవుడ్ చేజులను తలపించే విధంగానే ఉన్నాయి. అందుకే 6 కోట్లతో మొదలుపెట్టిన ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు అయ్యిందని కూడా మనకు సులభంగానే అర్ధమవుతుంది. కాకపోతే ఎంతో స్టయిలిష్‌ గా ఉన్న ఈ టీజర్లో.. అసలు సోల్ (ఆత్మ) అనేదే లేదు. హీరో ఎవరు.. అతని ఎజెండా ఏంటి.. లేకపోతే విలన్ల ఎజెండా ఏంటి.. అనేది ఏ మాత్రం అర్ధమవ్వదు. ఏదో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకునేవారు సరదాగా చాలా సినిమాల్లో ముక్కలను కలిపి అతికించినట్లే ఉంది. కత తాలూకు ఎసెన్స్ గురుడవేగ టీజర్లో మిస్సయ్యిందనే చెప్పొచ్చు.

ఇకపోతే ఈ సినిమాలో ప్రవీణ్‌ సత్తారు ఏకంగా సన్నీ లియోన్ తో ఒక ఐటెం సాంగ్ కూడా చేయించాడు. అంతేకాదండోయోయ్ 'విశ్వరూపం' ఫేం పూజా కుమార్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ట్రైలర్ తో నన్నా ఇంప్రెస్ చేస్తారేమో చూడాలి.