Begin typing your search above and press return to search.

పవన్ - సూరి సినిమాకి ముందే డిజిట‌ల్ డీల్

By:  Tupaki Desk   |   3 Dec 2021 4:38 AM GMT
పవన్ - సూరి సినిమాకి ముందే డిజిట‌ల్ డీల్
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. భీమ్లా నాయ‌క్ - హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. త‌దుప‌రి హ‌రీష్ శంక‌ర్ .. సురేంద‌ర్ రెడ్డిల‌తో సినిమాలు చేయాల్సి ఉంది. అయితే చాలా ముందే సురేంద‌ర్ రెడ్డితో ప‌వ‌న్ సినిమాకి ఓటీటీ డీల్ ముగియ‌నుంద‌ని తెలిసింది. ప్ర‌ఖ్యాత జీ స్టూడియోస్ ఆ మేర‌కు ఒప్పంద చేసుకుంద‌ని స‌మాచారం.

జీ- నెట్ వర్క్ టాలీవుడ్ లో బ‌ల‌మైన అడుగులు వేస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటూ బ‌లం పెంచుకుంటోంది. జీ- ప్రస్తుతం RC15 - బంగార్రాజు వంటి చిత్రాలతో అనుబంధం కలిగి ఉంది. ఈ రెండు సినిమాల రైట్స్ ను సొంతం చేసుకుంది. RRR డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామిగానూ ఉంది. తాజా స‌మాచారం మేర‌కు.. పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి కలయికలో వస్తున్న PSPK29 డిజిటల్ స్ట్రీమింగ్ .. శాటిలైట్ హక్కులను జీ-చానెల్ ఛేజిక్కించుకుంద‌ని స‌మాచారం. ఇంకా చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌క ముందే డీల్ క్లోజ్ అవ్వ‌డం ఆస‌క్తిక‌రం.

తెలుగు చిత్రసీమలో భారీ క్రేజీ చిత్రాల్ని విడుద‌ల చేయ‌డం ద్వారా భారీ ప్ర‌ణాళిక‌ల్ని విస్త‌రించేందుకు జీ స్టూడియోస్ ప్ర‌య‌త్నిస్తోంది. మునుముందు ప‌లువురు అగ్ర హీరోల చిత్రాల్ని జీ సంస్థ ఛేజిక్కించుకోనుంద‌ని తెలుస్తోంది.