Begin typing your search above and press return to search.
PSPK28 ః బద్రి.. వకీల్ సాబ్ సెంటిమెంట్ రిపీట్ కానుందా?
By: Tupaki Desk | 28 Jun 2021 5:00 PM ISTపవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ మరియు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలు పూర్తి కాకముందే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా మొదలు కాబోతుంది. దాదాపుగా రెండేళ్ల క్రితమే ఈ ప్రకటన వచ్చినా కూడా కరోనా కారణంగా సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. దర్శకుడు హరీష్ శంకర్ కు స్క్రిప్ట్ ను రెడీ చేసుకునేందుకు కావాల్సినంత సమయం దక్కింది. స్క్రిప్ట్ వర్క్ లో క్రిష్ నుండి మొదలుకుని పవన్ కళ్యాణ్ వరకు భాగస్వామ్యం అయ్యారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో పవన్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ ను మించిన మాస్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ప్రకాష్ రాజ్ ఉంటాడని.. ఆయన పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. విలన్ గానా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగానా అనే విషయంలో స్పష్టత లేదు. కాని ఖచ్చితంగా పవన్ తో ప్రకాష్ రాజ్ చేయబోతున్న ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. బద్రి మరియు వకీల్ సాబ్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించాడు. ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఇప్పుడు ఆ సెంటిమెంట్ హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ ల కాంబో సినిమాకు రిపీట్ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు యూనిట్ సభ్యులు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఖచ్చితంగా ఈ సినిమా రాబడుతుందనే నమ్మకంను పవన్ కళ్యాణ్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరో గబ్బర్ సింగ్ లా ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్న అభిమానులకు ప్రకాష్ రాజ్ ఎంట్రీ మరింత నమ్మకంను కలిగిస్తుంది.