Begin typing your search above and press return to search.

టెంపర్‌ ను మరిపించేలా వకీల్‌ సాబ్‌ లో ఆ సీన్‌

By:  Tupaki Desk   |   25 Feb 2020 11:15 AM IST
టెంపర్‌ ను మరిపించేలా వకీల్‌ సాబ్‌ లో ఆ సీన్‌
X
ఒకప్పుడు సినిమాల్లో కోర్టు సీన్స్‌ చాలా ఎక్కువగా ఉండేవి. కాని ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈతరం ప్రేక్షకులకు కోర్టు సీన్‌ అనగానే ఠక్కున ఎన్టీఆర్‌ చేసిన ‘టెంపర్‌’ చిత్రం ప్రీ క్లైమాక్స్‌ సీన్‌ గుర్తుకు వస్తుంది. ఆ సీన్‌ లో ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూపడంతో పాటు సినిమాకు ఆ సీన్‌ హైలైట్‌ గా ఉంటుంది. ఎన్టీఆర్‌ ను కొత్తగా చూపించడంతో పాటు ఎన్టీఆర్‌ లోని నటనను పూర్తిగా దర్శకుడు పూరి రాబట్టడంలో సఫలం అవ్వడంతో ఇప్పటి వరకు ఆ సీన్‌ ది బెస్ట్‌ కోర్టు సీన్‌ గా నిలిచిందని అభిమానులు అంటూ ఉంటారు.

టెంపర్‌ కోర్టు సీన్‌ ను మరిపించేలా ఇకపై కోర్టు సీన్‌ అనగానే పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సీన్‌ గుర్తుకు రాబోతుందట. పింక్‌ రీమేక్‌ లో కోర్టు సీన్‌ చాలా కీలకం. కోర్టులో సినిమా చాలా సమయం సాగుతుంది. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ఆసీన్స్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఆ సీన్స్‌ లో పవన్‌ నటన చూసిన తర్వాత యూనిట్‌ సభ్యులు కొందరు టెంపర్‌ సీన్‌ ను మర్చి పోయి ఇకపై ఈ సినిమా కోర్టు సీన్‌ ను అంతా గుర్తుంచుకుంటారు అంటూ చాలా నమ్మకం గా చెబుతున్నారు.

దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌ చేస్తున్నాడు. బాలీవుడ్‌ లో హిట్‌ అయిన పింక్‌ ఇప్పటికే తమిళంలో సక్సెస్‌ అయ్యింది. తెలుగులో కూడా ఖచ్చితంగా హిట్‌ అవుతుందనే నమ్మకంతో దిల్‌ రాజు ఉన్నాడు. వచ్చే నెలలో ఫస్ట్‌ లుక్‌ మరియు టీజర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మే లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.