Begin typing your search above and press return to search.

బయటకొచ్చి చూస్తే.. రికార్డుల మోతే

By:  Tupaki Desk   |   8 Nov 2017 4:21 AM GMT
బయటకొచ్చి చూస్తే.. రికార్డుల మోతే
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. త్రివిక్రమ్ తన సినిమాల్లో మాటలతో పాటు పాటలు కూడా బాగా హమ్మింగ్ గా ఉండేలా కేర్ తీసుకుంటాడు. అందుకే అత్తారింటికి దారేది మూవీలో అన్ని పాటలు జనం నోళ్లలో బాగా నానాయి.

పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో లేటెస్ట్ట గా వస్తున్న మూవీలో పాట అప్పుడే అభిమానులను విపీరీతంగా ఆకట్టుకుంటోంది. పవర్ స్టార్ 25వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రస్తుతానికి అజ్ఞాతవాసి టైటిల్ న పరిశీలిస్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా కోసం ట్యూన్ చేసి బయటకొచ్చి చూస్తే పాటను బయటకొదిలాడు. ఈ పాట పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం 10 గంటల వ్యవధిలోనే 1 మిలియన్ హిట్స్ వచ్చాయంటే అభిమానులు ఎంత ఆసక్తిగా విన్నారో అర్ధమైపోతుంది. పాటలో ఉన్న అర్ధవంతమైన సాహిత్యానికి సింగర్ల గొంతులోని తియ్యదనం తోడవడంతో మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అనిరుద్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళంలో మంచి హిట్లే ఉన్నాయి. తొలిసారి తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా సాంగ్ కోసం చేసిన పాటకు వచ్చిన రెస్పాన్స్ అతడికి బోలెడు హ్యాపీ అనిపించింది. ఇదే విషయం ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేయడంతో బయటికొచ్చి చూస్తే పాటను ఇంత బ్రహ్మాండమైన హిట్ చేసినందుకు అభిమానులందరికీ థ్యాంక్స్ కూడా చెప్పుకొచ్చాడు. ఈ పాటతో ఈ సినిమాలో మిగతా పాటలపై అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయి. వాటిని అనిరుధ్ ఎంతవరకు రీచ్ అవుతాడో చూడాలి మరి.