Begin typing your search above and press return to search.

టైటిల్ లేకుండానే అన్ని పనులు కానిచ్చేస్తున్నారుగా..!

By:  Tupaki Desk   |   8 Aug 2021 12:30 AM GMT
టైటిల్ లేకుండానే అన్ని పనులు కానిచ్చేస్తున్నారుగా..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా 'అయ్యప్పనుమ్ కోషియమ్' అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. '#PSPKRana' అనే వర్కిగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి టైటిల్ ఖరారు చేయకుండానే 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ ఫస్ట్ లుక్ ని కూడా వదిలారు. ఇదే క్రమంలో అతి పెద్ద ఆత్మగౌరవ యుద్ధానికి సన్నద్ధం అవ్వండి అంటూ ఈ చిత్రాన్ని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు.

త్వరలో ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని కూడా వదలబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సినిమాకి టైటిల్ అనౌన్స్ చేయకుండా.. షూటింగ్ మొత్తం పూర్తి చేయడమే కాకుండా.. సాంగ్ రిలీజ్ చేస్తుండటం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ పాట లిరికల్ వీడియోతో పాటుగా టైటిల్ అనౌన్సమెంట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. పవన్ బర్త్ డే కూడా దగ్గర్లో ఉండటంతో ముందుగా టైటిల్ అండ్ సాంగ్ ని వదిలి.. సెప్టెంబర్ 2న టీజర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

'PSPKRana' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తున్నారు. ఇటీవల బయటకు వస్తునన్న స్టిల్స్ - వీడియోలు చూస్తుంటే త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారని ప్రచారం మొదలైంది. పోలీస్ ఆఫీసర్ - రిటైర్డ్ హవల్దార్ జీవితాల్లో అహం ఆత్మాభిమానం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసున్నాయనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యామీనన్.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.