Begin typing your search above and press return to search.

#PSPK 27 .. వీడియో గేమ్ స్ఫూర్తితో పోరాట స‌న్నివేశాలు?

By:  Tupaki Desk   |   9 March 2021 1:30 PM GMT
#PSPK 27 .. వీడియో గేమ్ స్ఫూర్తితో పోరాట స‌న్నివేశాలు?
X
బాహుబ‌లి 1- బాహుబ‌లి 2 చిత్రాల‌కు యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు ఎంత పెద్ద ప్ల‌స్ అయ్యాయో తెలిసిందే. ఆ త‌ర్వాత హిస్టారికల్ కాన్సెప్ట్ ఉన్న మూవీ `గౌత‌మి పుత్ర శాత‌కర్ణి`లోనూ క్రిష్ యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని ఎమోష‌న‌ల్ గా ర‌క్తి క‌ట్టించేలా తెర‌కెక్కించారు. విదేశీ మ‌ల్ల యోధుల‌తో శాత‌కర్ణి అరివీర భ‌యంక‌ర పోరాటాల్ని కూడా చూపించి ఔరా! అనిపించారు.

ప్ర‌స్తుతం పవన్ కళ్యాణ్ - క్రిష్ చిత్రం పీరియడ్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిన‌దే. 17 వ శతాబ్దంలోని ఒక వీరుడి క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ సెట్లు రూపొందించారు. వాటిలో భారీ యాక్ష‌న్ సీన్స్ ని తెర‌కెక్కిస్తున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పై యాక్ష‌న్ సీక్వెన్సుల్ని మునుపెన్నడూ చూడ‌ని రేంజులో రూపొందించాల‌న్న‌దే క్రిష్ ప్లాన్‌‌. అందుకు త‌గ్గ‌ట్టే స్టంట్స్ రూప‌క‌ల్ప‌న కోసం క్రిష్ భారీ క‌స‌ర‌త్తు చేశార‌ని తెలిసింది. ఇప్ప‌టికే అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ వీడియో గేమ్ నుండి స్ఫూర్తి పొంది # పిఎస్‌పికె 27 యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశార‌ని గుస‌గుస‌లు విని‌పిస్తున్నాయి. ఇటీవ‌ల కీల‌క షెడ్యూల్ పూర్తి చేసి అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లిన ప‌వ‌న్ తిరిగి క్రిష్ తో షెడ్యూల్ కి రెడీ అవుతున్నార‌ని తెలిసింది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ క‌థానాయిక‌. జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఓ స్ప‌ష‌ల్ రోల్ చేస్తోంది. ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంక్రాంతి 2022 కానుక‌గా రిలీజ్ చేస్తామ‌ని టీమ్ ప్ర‌క‌టించింది.