Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ ప్యాక్డ్ మూమెంట్ః సాయంత్రం కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌!

By:  Tupaki Desk   |   11 March 2021 6:15 AM GMT
ప‌వ‌ర్ ప్యాక్డ్ మూమెంట్ః సాయంత్రం కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రీ-ఎంట్రీలో నాలుగు సినిమాలు అనౌన్స్ చేశారు. ప్ర‌స్తుతం మూడు సినిమాలు ర‌న్నింగ్ లో ఉన్నాయి. కానీ.. ఇప్పుడు ప్యాన్స్ దృష్టి మొత్తం ఒకే సినిమాపై ఫోక‌స్ అయి ఉంది. అదే.. ప‌వ‌న్‌-క్రిష్ కాంబోలో రాబోతున్న పీరియాడిక‌ల్ మూవీ. పీఎస్‌పీకే-27 వ‌ర్కింగ్ టైటిల్ తో సెట్స్ పై ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తీ విష‌యం ప‌వ‌న్ ఫ్యాన్స్ తోపాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల్లోనూ క్యూరియాసిటీని అంత‌కంత‌కూ పెచేస్తోంది.

ఈ సినిమాలో ప‌వ‌న్ బందిపోటుగా క‌నిపించ‌బోతున్నాడు. ఇది 15వ శ‌తాబ్దం నాటి ప‌రిస్థితుల ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఇందులో చార్మినార్, గండికోట సంస్థానం వంటి చారిత్ర‌క క‌ట్టడాల‌కు సంబంధించిన సెట్స్ వేశారు. ప‌వ‌న్ కెరీర్ లోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇలా.. ఒక‌టీ రెండు కాదు.. ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి ఈ సినిమాలో!

అంతేకాదు.. ఈ సినిమా టైటిల్ కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుతోపాటు ప‌లు పేర్లు డిస్క‌ష‌న్ లో ఉన్నాయి. ఇక‌, అన్నింటిక‌న్నా ముఖ్య‌మైంది ప‌వ‌న్ లుక్‌. ఆనాటి వీరుడిగా ప‌వ‌న్ ఎలా క‌నిపించ‌బోతున్నారు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌వ‌ర్ స్టార్ కోసం స్పెష‌ల్ డిజైన్ క్రియేట్ చేశాడ‌ట క్రిష్‌. దీంతో.. అదెలా ఉంటుందో చూడాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు ఫ్యాన్స్‌.

ఈ ఉత్కంఠ వీడ‌బోయే స‌మ‌యం ఈ రోజు సాయ‌త్రం! ఈవెనింగ్ 5 గంట‌ల 19 నిమిషాల‌కు ఫ‌స్ట్ లుక్ తోపాటు టైటిల్ కూడా ప్ర‌క‌టించ‌బోతోంది యూనిట్‌. దీంతో.. అది ఎలా ఉంటుందోన‌ని అభిమానులు తెగ ఆతృత‌గా ఉన్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత దిగ్గ‌జం కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నారు.