Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' ... ఫస్ట్ లుక్ వెనక రీజన్ ?

By:  Tupaki Desk   |   2 March 2020 7:15 AM GMT
వకీల్ సాబ్ ... ఫస్ట్ లుక్ వెనక రీజన్ ?
X
దాదాపు రెండేళ్ళయింది పవర్ స్టార్ సినిమా అప్డేట్ వచ్చి. రాజకేయవేత్తగా బిజీ అవ్వాలన్న ఉద్దేశ్యంతో సినిమాలకు రెండేళ్ళు దూరమయ్యాడు పవర్ స్టార్. దీంతో మొన్నటి వరకూ తమ అభిమాన హీరో మళ్ళీ ఎప్పుడు మేకప్ వేసుకుంటాడా అని ఆతృతగా ఎదురుచూశారు ఫ్యాన్స్. ఇక వారి సంకల్పం గట్టిగా ఉండటంతో ఎట్టకేలకు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్. 'పింక్' రీమేక్ తో ముందుగా ఫ్యాన్స్ ను ఖుషి చేయబోతున్నాడు.

సినిమా మొదలైనప్పటి నుండే వివిధ రకాల టైటిల్స్ తో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మొన్నీ మధ్యే ఎవరో షూట్ లో పవన్ యాక్షన్ ఎపిసోడ్ వీడియో కూడా బయటపెట్టేసారు. ఇక తాజాగా ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ఫిక్సయినప్పటి నుండి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ మరీ ఎక్కువ్వయ్యాయి. ఓ ఫ్యాన్ చేసిన టైటిల్ లోగో అయితే బాగా వైరల్ అయింది.

దీనిపై యూనిట్ సీరియస్ కూడా అయ్యారట. ఇక కట్టలు తెంచుకున్న అభిమానాన్ని ఆపలేమని భావించిన యూనిట్ రిలీజ్ కి రెండు నెలల ముందే ఫస్ట్ లుక్ ప్లాన్ చేసారు. ఈ రోజు సాయంత్రం వదులుతున్నారు. అదీ సంగతి ఉన్నపళంగా మేకర్స్ ఫస్ట్ లుక్ తో రావడానికి కారణం పవన్ ఫ్యాన్సే. మరి ఈ ఫస్ట్ లుక్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.