Begin typing your search above and press return to search.

PSPK 26 .. ఫ్యాన్స్ కి డ‌బుల్ ధ‌మాకా ట్రీట్

By:  Tupaki Desk   |   29 Feb 2020 4:30 AM GMT
PSPK 26 .. ఫ్యాన్స్ కి డ‌బుల్ ధ‌మాకా ట్రీట్
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 26వ చిత్రం `లాయ‌ర్ సాబ్` ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం ప‌వ‌న్ కేవ‌లం 24 రోజుల షూటింగ్ డేస్ కేటాయించారు. దాని ప్ర‌కార‌మే.. ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ అండ్ టీమ్ షూటింగుల‌కు వెళుతోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో బీజీగా ఉండగా.. ఇందులో ఇత‌ర కీల‌క‌ న‌టీన‌టుల‌పై స‌న్నివేశాలను చిత్రీక‌రించే ప‌నిలో ఉన్నార‌ట‌. జ‌న‌సేన కార్య‌క‌లాపాల నుంచి కాస్త‌ ఫ్రీ అవ్వ‌గానే మ‌ళ్లీ య‌థావిథిగా షూటింగ్ కి హాజ‌ర‌వుతారు. అయితే ఈలోపు ప‌వ‌న్ త‌న‌ అభిమానుల‌కు ట‌బుల్ ట్రీట్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నార‌ని స‌మాచారం.

మార్చి 2న `లాయ‌ర్ సాబ్` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌డానికి దిల్ రాజు బృందం రెడీ అవుతోందిట‌. అభిమానుల గుండెల్లోకి దూసుకెళ్లే బాణంలా ఈ లుక్ ఉంటుంద‌ని ప్ర‌చారం సాగిపోతోంది. అలాగే అదే వారంలో అంటే మార్చి 8 న మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా తొలి లిరిక‌ల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయ‌డానికి యూనిట్ రెడీ అవుతోంద‌ట‌. ఆ మేర‌కు ఇన్ సైడ్ టాక్ రివీలైంది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉర‌క‌లేస్తోంది. ఒకే వారంలో డ‌బుల్ ధ‌మాకా ట్రీట్ ప్లాన్ చేస్తే అభిమానుల‌కు అంత‌కంటే కావాల్సింది ఇంకేం ఉంటుంది?

ఇప్ప‌టికే లాయ‌ర్ సాబ్ లో ప‌వ‌న్ లుక్ కి సంబంధించిన లీక్డ్ ఫోటో.. వీడియో వైర‌ల్ అయిన‌ సంగ‌తి తెలిసిందే. రోడ్డు మీద ఓ పాన్ షాపు ఎదురుగా న‌డుచు కుంటూ వెళుతున్నారు ప‌వ‌న్. అయితే ఆ ఫోటో స‌రైన క్లారిటీ తో లేదు. మ‌రి అదే గెట‌ప్ తో ఉన్న‌ లుక్ ని రిలీజ్ చేస్తారా? మ‌రో కొత్త లుక్ తో వ‌స్తారా? అన్న‌ది చూడాలి. ఈ చిత్రాన్ని దిల్ రాజు- బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ సౌక‌ర్యం కోసం ప్ర‌త్యేక‌ హెలీకాఫ్ట‌ర్ ని సైతం అందుబాటు లో ఉంచేందుకు దిల్ రాజు అంగీక‌రించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.