Begin typing your search above and press return to search.
#PSLVC49 ప్రయోగం.. ఇస్రోకి హ్యాట్సాఫ్ చెప్పిన జవాన్
By: Tupaki Desk | 8 Nov 2020 9:15 AM ISTనింగిలో ప్రయోగాలు చేయడంలో భారత్ ఎంతో అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉంది. అమెరికా- రష్యా లాంటి అగ్ర రాజ్యాలకు ధీటుగా రకరకాల ప్రయోగాలు చేసి అంతరిక్ష పరిశోధనల్లో ఎంతో ముందుకు సాగాం. పలు దేశాలకు చెందిన ఉపగ్రహాల్ని భారతీయ శాటిలైట్లు విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశ పెట్టాయి.
ఇంతకుముందు చంద్రునిపైకి ప్రతిష్ఠాత్మక రోవర్ ని పంపిన ఘనత కూడా భారత్ కైవశం చేసుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా మన సైంటిస్టులు ప్రపంచ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
తాజాగా PSLVC49 ప్రయోగం విజయవంతమైంది. ఈ భారీ రాకెట్ ఉపగ్రహ ప్రయోగం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ -శ్రీహరికోట నుంచి జరిగింది. ఈ సందర్భంగా ఇస్రో ఘనతను పలువురు సెలబ్రిటీలు కొనియాడారు. #ISRO #EOS01 అని ట్యాగ్ చేస్తూ సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఇస్రో బృందంపై ప్రశంసలు కురిపించారు. ఇస్రో ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోని అభిమానులకు షేర్ చేసి.. ``దేశం గర్వించదగ్గ మరో ప్రయోగమిది`` అని సాయి తేజ్ ప్రశంసించారు.
యాథృచ్ఛికంగా అయినా సాయితేజ్ నటించిన జవాన్ కి అంతరిక్ష ప్రయోగాలకు సంబంధం ఉంది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. జవాన్ ఆశించిన విజయం అందుకోకపోయినా సాయి తేజ్ హార్డ్ వర్క్ మాత్రం ఎలివేట్ అయ్యింది. దేశభక్తుడిగా అతడి నటనకు ప్రశంసలు దక్కాయి. సాయితేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ త్వరలో రిలీజ్ కి రానుంది. తదుపరి వరుస సినిమాలతో బిజీ కానున్నాడు.