Begin typing your search above and press return to search.

విహంగంలో 'చోళుల ప్రయాణం'

By:  Tupaki Desk   |   20 Sep 2022 4:29 PM GMT
విహంగంలో చోళుల ప్రయాణం
X
`పొన్నియిన్ సెల్వన్-1` సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. దర్శకుడు మణిరత్నంతో తమ సినిమా ప్రమోషన్ లో నటీనటులతో క‌లిసి బిజీగా ఉన్నారు. ఇప్పుడు టీమ్ అంతా `చోళుల ప్రయాణం` అంటూ బోలెడంత హంగామాతో ప్ర‌చారాన్ని ప్రారంభించింది.

గురువు మ‌ణిర‌త్నం .. జయం రవి ఇత‌ర‌ సహనటులు చియాన్ విక్రమ్.. కార్తీ ... త్రిష కృష్ణన్ లతో కలిసి విమానంలో బ‌య‌ల్దేరిన‌ ఫోటోల‌ను పంచుకున్నారు. వీటిలో వారంతా హ్యాపీగా కెమెరాకు పోజులిచ్చారు. చియాన్ విక్రమ్- కార్తీ - జయం రవి ఒకే విధమైన దుస్తులలో కనిపిస్తుండగా.. త్రిష పసుపు రంగు టాప్ నలుపు ప్యాంట్ తో అందంగా క‌నిపిస్తోంది. చోళుల‌ ప్రయాణం ప్రారంభం #పొన్నియిన్ సెల్వన్1 #PS1 అని దీనికి క్యాప్ష‌న్ ని రాశారు.

జయం రవి పోస్ట్ ను షేర్ చేసిన వెంటనే.. అభిమానులు కామెంట్ సెక్షన్ ను నింపారు. ఒక అభిమాని ``సూపర్.. చాలా మంచి ఫోటోలు.... కానీ అబ్బాయిలు విక్రమ్ సర్ ని చూస్తారు.... అద్భుతం కదా? గ్రేట్`` అని రాస్తే మరొకరు ``వావ్... సూపర్ హ్యాపీ టు జర్నీ`` అని రాశారు.

ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో కలిసి పని చేయడం గురించి త్రిష ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది. త‌ను మాట్లాడుతూ-``ఆష్ మామ్ ని అదృష్టవశాత్తూ నా షూట్‌ మొదటి రోజున ఇంటరాక్ట్ అయ్యాను. ఆమె బాహ్యంగాను అంత‌ర్గ‌తంగా కూడా అందంగా క‌నిపించింది. అయినా నేను చెప్పాల్సిన అవసరం లేదు. విషయం ఏమిటంటే.. ఇది ఒక స‌వాల్ .. ఈ చిత్రంలో మేము ఒకరినొకరు ఇష్టపడకూడదు. కానీ మేము సెట్ లో చాలా స‌న్నిహితుల‌య్యాం`` అని తెలిపింది.

``మణి సార్ వచ్చి వినండి.. మీరు చాలా ఎక్కువ క‌లిసిపోతున్నారు.. ఆపండి ఇక నేను మాట్లాడుతున్నాను.. నా సన్నివేశం కోసం ఈ స్నేహాన్ని ఒప్పుకోను`` అనేవారు అని త్రిష‌ తెలిపారు.

పొన్నియిన్ సెల్వన్ చిత్రం కల్కి కృష్ణమూర్తి చారిత్రక నవల (అదే పేరుతో విడుద‌లైంది) ఆధారంగా రూపొందిన సినిమా. చోళ రాజవంశం ఆవిర్భావాన్ని ఈ పుస్త‌కం వివ‌రించింది. పొన్నియ‌న్ సెల్వ‌న్ మొదటి భాగం సెప్టెంబర్ 30న థియేటర్లలోకి విడుద‌ల కానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.