Begin typing your search above and press return to search.

సినిమా వాళ్ల‌కు ఓట్లేయ‌వ‌ద్ద‌న్న సినిమా న‌టుడు!

By:  Tupaki Desk   |   28 July 2019 4:18 AM GMT
సినిమా వాళ్ల‌కు ఓట్లేయ‌వ‌ద్ద‌న్న సినిమా న‌టుడు!
X
తెలుగుదేశం పార్టీకి టాలీవుడ్ కు ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నది నిజం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినిమా రంగంలో స్టార్ హీరో గా వెలుగొంది.... ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవడంతో గత మూడు దశాబ్దాలుగా సహజంగానే ఇండస్ట్రీకి... టిడిపికి చాలా లింకులు ఉన్నాయి. ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు కూడా టాలీవుడ్ తో అదే తరహా అనుబంధాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు - అగ్ర నిర్మాతలు చాలామంది తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్షంగానో... పరోక్షంగానో ప్రచారం చేసిన వాళ్లే.

ఎప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయ్యాయో అప్పటినుంచి టాలీవుడ్ జనాల్లో మార్పు వచ్చింది. ఇండస్ట్రీ అంతా హైదరాబాద్‌ లో కేంద్రీకృతం అయి ఉండడంతో టాలీవుడ్ జనాలు తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ పాట పడుతున్నాయి. దీనిపై అనేక చర్చలు కూడా నడుస్తున్నాయి. టాలీవుడ్ జనాలకు అక్కడ ఉన్న ఆస్తులు... వ్యాపారాలు నేపథ్యంలో వాళ్ళంతా టిఆర్ఎస్ భజన చేస్తున్నారన్నది త‌ర‌చూ వినిపించే మాట. ఇక ఇప్పుడు ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి సీఎం గా ఉన్నారు.

ఇక్క‌డ జ‌గ‌న్ సీఎం అయిన‌ప్పుడు ఇండ‌స్ట్రీలో పెద్ద త‌ల‌కాయ‌లు ఆయ‌నకు క‌నీసం శుభాకాంక్ష‌లు కూడా చెప్ప‌లేదు. దీంతో జ‌గ‌న్ సీఎం అవ్వ‌డం ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు న‌చ్చ‌లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. జ‌గ‌న్ సీఎం అయ్యి రెండు నెల‌లు అవుతున్నా జ‌గ‌న్ గురించి ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. ఇక పృథ్వి - పోసాని - జీవితా రాజ‌శేఖ‌ర్ లాంటి వాళ్లు మాత్రం జ‌గ‌న్‌ కు ఎన్నిక‌ల ముందే ప్ర‌చారం చేశారు. ఇక ఇప్పుడు జ‌గ‌న్ పృథ్విని టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానెల్ చైర్మ‌న్ చేశారు. పృథ్వి కొద్ది రోజులుగా ఇండ‌స్ట్రీ జ‌నాల‌ను టార్గెట్‌ గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

తాను వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డంతో త‌న‌కు కొంద‌రు సినిమా అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదని... త‌న‌కు అవ‌కాశాలు లేక‌పోయినా వైసీపీతోనే త‌న ప్ర‌యాణం కొన‌సాగుతుంద‌న్నాడు. ఇక జ‌గ‌న్ సీఎం కావ‌డం సినిమా వాళ్ల‌కు ఇష్టం లేద‌ని... ఇక‌పై జ‌నాలు సినిమా వాళ్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని... వాళ్ల‌కు ఓట్లేయ‌వ‌ద్ద‌ని పిలుపు ఇవ్వ‌డం విశేషం. పృథ్వి వ్యాఖ్య‌లు ఎలా ఉన్నా ఎందుకో గాని ఇండ‌స్ట్రీ వాళ్లు జ‌గ‌న్‌ ను క‌లిసేందుకే కాదు... క‌నీసం శుభాకాంక్ష‌లు చెప్పేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేద‌న్న‌ది క్లీయ‌ర్‌ గా తెలుస్తోంది.