Begin typing your search above and press return to search.

కత్తి మహేష్ పై కమెడియన్ ఫృథ్వీ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   15 Aug 2021 12:30 PM
కత్తి మహేష్ పై కమెడియన్ ఫృథ్వీ సంచలన వ్యాఖ్యలు
X
కత్తి మహేష్ మరణం వెనుక ఏదో మతలబు ఉందని.. కత్తి మహేష్ తోపాటు కారులో పక్కన కూర్చున్న వ్యక్తికి చిన్న గీత కూడా దెబ్బ తగులకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని కమెడియన్ ఫృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చనిపోయిన కత్తి మహేష్ గురించి ట్రోలింగ్ చేయడం తనకు బాధ అనిపించిందని.. కుటుంబాన్ని టార్గెట్ చేయడం తనకు ఆవేదన కలిగించిదని కమెడియన్ ఫృథ్వీ అన్నారు.

కత్తి మహేష్ లేని లోటు జర్నలిజం, క్రిటిసిజంలో కానీ పూడ్చలేనిది అని ఫృథ్వీ అన్నారు. తిరుమలలో తనపై విమర్శలు వచ్చినప్పుడు తనకు మద్దతుగా నిలిచిన ఏకైక వ్యక్తి కత్తి మహేష్ అని ఫృథ్వీ గుర్తు చేసుకున్నారు.

కత్తి మహేష్ కు బాగా నాలెడ్జ్ ఉందని.. అతడికి తెలివితేటలు, విషయపరిజ్ఞానం బాగుందని ఫృథ్వీ అన్నారు. యుద్ధంలో దిగాక కత్తి మరిచిపోతే మన తల తీసుకొని పోతారని.. అందుకే పోరాడాలని కత్తి మహేష్ అనేవారని ఫృథ్వీ చెప్పుకొచ్చారు.

కత్తి మహేష్ ఏమీ సంపాదించుకోలేదని.. ఓటీటీల్లో దర్శకత్వం చేయడానికి రెడీ అయిన వేళ కత్తి మహేష్ మరణం కలిచివేసిందని ఫృథ్వీ అన్నారు. ఇండస్ట్రీ తరుఫున ఏ సాయం అందలేదని అన్నారు. కత్తి మహేష్ చికిత్సపొందుతుండగానే చనిపోయాడని సృష్టించారని ఫృథ్వీ ఆరోపించారు..

తాను పోలీస్ ఆఫీసర్ అయితే కత్తి మహేష్ మరణంపై ఖచ్చితంగా విచారణ జరిపేవాడినని.. కత్తి పక్కనున్న వ్యక్తికి ఏ గాయం తగులకపోవడం తనకు ఇప్పటికీ అనుమానాస్పదంగా కనిపిస్తోందని ఫృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

-ఫృథ్వీ మాట్లాడిన వ్యాఖ్యల వీడియోను కింద చూడొచ్చు.