Begin typing your search above and press return to search.

గురూజీ కమెడియన్ కోసం అలా..

By:  Tupaki Desk   |   19 Jan 2019 5:30 PM GMT
గురూజీ కమెడియన్ కోసం అలా..
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా గురూజీ క్యాస్టింగ్ పై కూడా ఫోకస్ చేస్తున్నాడట. ఈ క్యాస్టింగ్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం కమెడియన్ పృథ్విని తీసుకున్నారని ఒక న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చింది. తాజా సమాచారం ఏంటంటే పృథ్వి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడట. పృథ్వి చాలా టాలెంట్ ఉన్న నటుడే గానీ కమెడియన్ గా పాపులర్ అయిన పృథ్వి ని ఇలాంటి పాత్రలో చూపించాలనుకోవడం ఒక సాహసమే. ఆడియన్స్ కనుక సరిగా రిసీవ్ చేసుకోకపోతే పాత్ర ఔచిత్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది.

అందుకే విలన్ పాత్రను తేనే పూసిన కత్తిలా ఉండేలా డిజైన్ చేశారట. ఈ పాత్రతో తన కెరీర్ పెద్ద మలుపు తిరుగుతుందని పృథ్వి చాలా నమ్మకంగా ఉన్నాడట. మరి గురూజీ చేసే ఈ ప్రయోగానికి ప్రేక్షకుల వద్ద నుండి ఎలాంటి ఆదరణ దక్కుతుందో వేచి చూడాలి. ఏదేమైనా పృథ్వి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది మంచి అవకాశమే. క్లిక్ అయితే కమెడియన్ గానే కాకుండా విలన్ గా కూడా టాలీవుడ్ ను దున్నుకోవచ్చు.