Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   11 March 2019 10:46 AM GMT
స్టార్‌ హీరో దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌
X
ఆరు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. మలయాళ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్న మోహన్‌ లాల్‌ తమిళం మరియు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న మోహన్‌ లాల్‌ తాజాగా 'లూసిఫర్‌' అనే చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.

ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన పృథ్వీరాజ్‌ దర్శకుడిగా చేస్తున్న సినిమా అవ్వడంతో మలయాళ సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దానికి తోడు ఈ చిత్రాన్ని స్వయంగా మోహన్‌ లాల్‌ తన ఆశీర్వాద్‌ సినిమాస్‌ బ్యానర్‌ పై నిర్మించబోతున్నాడు. స్టార్‌ నటుడి దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు పీక్స్‌ కు చేరాయి.

ఇక ఈ చిత్రంలో మలయాళ సీనియర్‌ హీరోయిన్‌ మంజు వారియర్‌ మరియు బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ లు నటించబోతున్నారు. భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని ముంబై - లక్ష్య దీవుస్‌ - ఫ్రాన్స్‌ - రష్యాల్లో చిత్రీకరణ జరుపనున్నారట. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మలయాళంతో పాటు తమిళం మరియు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.