Begin typing your search above and press return to search.

పృథ్వీ ఒకటి బ్లాక్ బస్టర్.. ఇంకోటి డిజాస్టర్

By:  Tupaki Desk   |   25 Dec 2015 9:30 AM GMT
పృథ్వీ ఒకటి బ్లాక్ బస్టర్.. ఇంకోటి డిజాస్టర్
X
పృథ్వీ.. ఈ పేరు ఈ ఏడాది టాక్ ఆఫ్ ద టాలీవుడ్. గత ఏడాది ‘లౌక్యం’ సినిమాతో సరికొత్త మలుపు తీసుకున్న ఈ కమెడియన్ కెరీర్.. ఈ ఏడాది ఇంకో పెద్ద టర్నే తీసుకుంది. అందులోనూ ఈ నెలలో వచ్చిన శంకరాభరణం - బెంగాల్ టైగర్ సినిమాలు కమెడియన్‌గా పృథ్వీకి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఇప్పటిదాకా బ్రహ్మానందం కనిపించినపుడు మాత్రమే థియేటర్లు హోరెత్తిపోయేవి. ఇప్పుడు పృథ్వీ కనిపించినా అదే రెస్పాన్స్ కనిపిస్తోంది థియేటర్లలో.

ఈ శుక్రవారం పృథ్వీ స్పెషల్ క్యారెక్టర్స్ చేసిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఒకటి ‘సౌఖ్యం’ కాగా.. ఇంకోటి ‘భలే మంచి రోజు’. ఇందులో సౌఖ్యం సినిమాలో పృథ్వీ క్యారెక్టర్ విషయంలో చాలా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. బాహుబలి స్పూఫ్ ట్రైలర్‌ కే హైలైట్‌ గా నిలిచింది. పృథ్వీ పాత్ర మీద ఎంతో ఆశతో థియేటర్లకు వచ్చారు ప్రేక్షకులు. ఐతే శివుడిగా శివలింగం మోసే సీన్ మినహాయిస్తే పృథ్వీ పెద్దగా నవ్వించలేకపోయాడు. బాహుబలి స్పూఫ్ కూడా ఓవరాల్‌ గా తేలిపోయింది. పృథ్వీ కనిపించే మిగతా సన్నివేశాలు పేలవంగా తయారయ్యాయి.

ఐతే ‘భలే మంచి రోజు’ సినిమాలో పృథ్వీ క్యారెక్టర్ మాత్రం భలే పేలింది. అసలీ సినిమాలో పృథ్వీ ఉన్న సంగతే చాలామందికి తెలియదు. అందుకే అతడి ఎంట్రీతో సర్ ప్రైజ్ అయ్యారు ప్రేక్షకులు. ముందు మామూలుగానే మొదలైన ఈ పాత్ర క్లైమాక్స్ లో చెలరేగిపోయింది. పోలీస్ క్యారెక్టర్లు వేసిన హీరోల్ని అనుకరిస్తూ పృథ్వీ చెప్పిన డైలాగులు ఓ రేంజిలో పేలాయి. ముఖ్యంగా సాయికుమార్‌ ముందు అతణ్నే ఇమిటేట్ చేసే సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ఎన్నో అంచనాలు పెట్టుకున్న పృథ్వీ క్యారెక్టర్ ఒకటి డిజాస్టర్ అనిపించుకుంటే.. ఏ అంచనాలు లేని పాత్ర బ్లాక్ బస్టర్ హిట్టయింది.