Begin typing your search above and press return to search.

ఫ్యూచర్ కామెడీ స్టార్ సిద్ధప్ప

By:  Tupaki Desk   |   7 Dec 2015 10:30 AM GMT
ఫ్యూచర్ కామెడీ స్టార్ సిద్ధప్ప
X
"థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ" ఒక్క డైలాగ్ తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు పృధ్వీ. ఇప్పుడు స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. వారానికో సినిమా రిలీజ్ అవుతుంటే అన్నింటిలోనూ పృధ్వీ దర్శనమిస్తున్నాడంటే.. ఈ కమెడియన్ స్పీడ్ అర్ధమవుతుంది.

డిసెంబర్ నెలలో ఫస్ట్ రిలీజ్ శంకరాభరణం. సినిమా సంగతి ఎలా ఉన్నా.. పర్సంటేజ్ పరమేష్ గా పృధ్వీ పంచిన నవ్వులు మాత్రం తిరుగులేనివి. పృధ్వీ కోసం ఓ సారి మూవీ చూడొచ్చని కూడా ప్రేక్షకులు చెప్పుకునే రేంజ్ లో ఇరగదీసేశాడు. ఈ వారం వెండితెరపైకి రానున్న సినిమా బెంగాల్ టైగర్. ఇందులోనూ పృధ్వీకి మంచి రోల్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు.. మనోడి కేరక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప గా బెంగాల్ టైగర్ లో దర్శనమివ్వనున్నాడు పృధ్వీ. గతంలో గోపీచంద్ లౌక్యంలోనూ బాయిలింగ్ స్టార్ బబ్లూగా చేసిన రోల్.. ఆ మూవీకే హైలైట్ అయింది. మరోసారి ఓల్డేజ్ హీరోలపై పంచ్ లు వేయబోతున్నాడనే సంగతి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం బ్రహ్మీకి ఆల్టర్నేటివ్ గా పృధ్వీ ఎదుగుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇలాంటి స్పెషల్ కేరక్టర్లు బ్రహ్మానందం పైనే ఉండేవి.

ఇదే కాదు. ఆ తర్వాత రానున్న గోపీచంద్ సౌఖ్యంలోనూ పృధ్వీ కేరక్టర్ సంథింగ్ స్పెషల్ గానే ఉండనుంది. ఈ మూవీలో చేసిన బాహుబలి స్పూఫ్ ఇప్పటికే ఆడియన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చేసింది కూడా.