Begin typing your search above and press return to search.

రివైండ్ 2015: సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్..

By:  Tupaki Desk   |   23 Dec 2015 7:30 PM GMT
రివైండ్ 2015: సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్..
X
ఏడాది మొత్తంలో ఒక్కసారి వచ్చి జూలు విదిల్చడంకంటే ఏడాది పొడువునా వార్తలలో నానడం మరింత కష్టమైన అంశం. ఒక్కో ఇయర్ ఒక్కొక్కరికి మరపురాని మధురానుభవాలను అందిస్తుంది. హృదయకాలేయం పోస్టర్ రిలీజ్ నుండి సినిమా పోస్ట్ రిలీజ్ వరకూ తరచూ వార్తలలో నిలిచినా సంపూర్ణేష్ బాబుకి గత ఏడాది సెన్సేషనల్ స్టార్ అవార్డు దక్కింది, మరి ఈ ఏడాది ఆ స్టార్ ఎవరంటే..

దాదాపు 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో నిలుస్తూ తనకంటూ ఒక టైమింగ్ - రైమింగ్ అలవరుచుకున్నా సరైన బ్రేక్ కోసం ఎదురుచూసిన పృథ్వికి ఈ ఇయర్ పట్టిందల్లా బంగారంగా నిలిచింది. పటాస్ - శంకరాభరణం - బెంగాల్ టైగర్ సినిమాలలో అతని పాత్రలకు ప్రత్యేక గుర్తింపు లభించడమేకాక అవకాశాలు వెల్లివిరిశాయి.

పృథ్వి నటించిన సౌఖ్యం సినిమా కూడా రేపు విడుదలై అతనికి మరింత మంచి పేరు తెచ్చిపెట్టి ఈ 2015 ని హై ఎండ్ లో ముగించాలని అందరూ కోరుకుంటున్నారు. కమెడియన్స్ కరువవుతున్న తరుణంలో భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్న పృథ్వినే ఈ యేడు సెన్సేషనల్ స్టార్,,