Begin typing your search above and press return to search.

'చెప్పను బ్రదర్‌' అంటూ పంచేశారా!!

By:  Tupaki Desk   |   11 July 2016 1:11 PM GMT
చెప్పను బ్రదర్‌ అంటూ పంచేశారా!!
X
మొత్తానికి సమాజంలో సంచలనానికి కారణమైన ఏ విషయమైనా కూడా.. అది ఖచ్చితంగా తన సినిమాల్లో ఉండాల్సిందే అంటుంటాడు అల్లరి నరేష్‌. గతంలో తానే చాలా హిట్టు సినిమాలపై స్పూఫులు చేశాడు. స్వయంగా మోహన్‌ బాబు పక్కన నటిస్తూనే.. లక్ష్మి మంచు టైపులో వాయిస్ ఇమిటేట్ చేశాడు. అయితే ఇప్పుడు తాను స్పూఫులు చేయట్లేదని చెప్పి.. తన సినిమాలో వేరే నటులతో ఇలాంటివి చేయిస్తున్నట్లున్నాడు.

పవన్ కళ్యాణ్‌ గురించి ఏదో ఒకటి చెప్పు అంటూ హార్డుకోర్ ఫ్యాన్స్ కొంతమంది రాద్దాంతం చేయడంతో.. ''చెప్పను బ్రదర్‌'' అంటూ సమాధానం చెప్పాడు అల్లు అర్జున్. ఆ విషయం పెద్ద రచ్చే అయిపోయింది. దానితో చివరకు బన్నీ మరో సినిమా ఫంక్షన్ లో తాను ఎందుకు అలా అన్నాడో.. కొందరి ఫ్యాన్స్ అరుపులు ఎంటైర్ మెగా ఫ్యామిలీని ఎలా బాధిస్తున్నాయో చెప్పుకొచ్చాడు. ఈ మొత్తం విషయం అటుంచితే.. ఇప్పుడు ''సెల్ఫీ రాజా'' సినిమాలో ఒక విలన్‌ 'ఎవడ్రా నువ్వు' అంటే.. వెంటనే ''చెప్పను బ్రదర్'' అంటున్నాడు 30 ఇయర్స్ పృథ్వి. వెంటనే ఆ విలన్ తిరిగి ''చూసుకుంటాం'' బ్రదర్‌ అంటాడో లేదో తెలియదు కాని.. ఇప్పుడు సెల్ఫీ రాజా ట్రైలర్ లో ఉన్న ఈ ముక్క చాలా వైరల్ అయిపోతోంది.

మొత్తానికి హిట్టు కోసం అల్లరోడు ఎన్ని సెన్సేషన్లు క్రియేట్ చేయడానికైనా తెగించేస్తున్నట్లున్నాడు. సర్లేండి.. ఇలా పవన్‌ ఫ్యాన్స్ అండ్ బన్నీ కామెంట్స్ కారణంగా క్రేజ్ పెరిగి హిట్టొస్తే పర్లేదు. కాని హైప్ ను అందుకోలేకపోతే మాత్రం తేడా కొట్టేస్తుంది బ్రదర్!!