Begin typing your search above and press return to search.

పృథ్వీ కామెడీ పండితే హిట్టేనా?

By:  Tupaki Desk   |   22 Dec 2015 7:30 AM GMT
పృథ్వీ కామెడీ పండితే హిట్టేనా?
X
సౌఖ్యం మూవీ ఎలా ఉంటుంది ? పెద్దగా పజిల్స్ ఏమీ పెట్టకుండా.. ఇది చక్కని రొటీన్ కమర్షియల్ అని తేల్చేశాడు హీరో గోపీచంద్. స్టోరీ మామూలుగానే ఉన్నా.. కామెడీ మాత్రం కొత్తగా ఇరగదీసేస్తుందని చెప్పాడు.

ఈ మూవీలో కామెడీ డిపార్ట్ మెంట్ మెయిన్ గా హ్యాండిల్ చేస్తున్నది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. గతంలోనూ గోపీచంద్ మూవీ లౌక్యంలో బాయిలింగ్ స్టార్ బబ్లూ కేరక్టర్ తోనే పృథ్వీ స్టార్ అయిపోయాడు. ఆ మూవీ కూడా రొటీన్ మూవీనే అయినా.. ఈ కేరక్టర్ కారణంగానే మూవీ జనాల్లోకి వెళ్లింది. ఇప్పుడు సౌఖ్యం కోసం కూడా మళ్ల పృథ్వీ మీదే డిపెండ్ అవుతున్నాడు గోపీచంద్. సౌఖ్యంలో పృథ్వీతో చాలానే స్పూఫ్ లు చేయించారు. వీటిలో బాహుబలి శివుడు స్పూఫ్ కి ఇప్పటికే చాలా అప్లాచ్ వచ్చింది.

రొటీన్ సినిమాలు అయినా.. పక్కా ఎంటర్ టెయిన్ మెంట్ ఉంటే సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అందులోనూ గోపీచంద్ కి మాస్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఈనెల 24న థియేటర్స్ లోకి వస్తున్న సౌఖ్యం రిజల్ట్.. ఇప్పుడు పృథ్వీ కేరక్టరైజేషన్ పైనే డిపెండ్ అయిపోయింది. ఈ కేరక్టర్ క్లిక్ అయితే లౌక్యంలా ఇంకో సక్సెస్ కొట్టినట్లే. మొత్తానికి బ్రహ్మానందం తర్వాత ఓ సినిమా సక్సెస్ ఓ కమెడియన్ పై ఆధారపడేటంతగా ఎదిగిపోయాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. బెస్టాఫ్ లక్.