Begin typing your search above and press return to search.
సావిత్రి గొప్పతనంకు నిదర్శనం.. తలదిండు కింద రూ.2 వేలు పెట్టింది
By: Tupaki Desk | 6 Dec 2020 2:10 PM ISTమహానటి సావిత్రి గురించి ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె గొప్ప మనిషి అంటూ కొందరు.. పొగరుబోతు అంటూ మరి కొందరు.. గొప్పలకు పోయి చిప్ప పట్టుకున్న రకం అంటూ ఇంకొందరు ఆమె గురించి రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నిజమే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆమె ఎవరిని మోసం చేయకుండా ఉండాలనుకునే గొప్ప మనసున్న వ్యక్తి అని.. ఎవరి వద్ద చేయి చాచి అవసరం కోసం అడుక్కోని పొగరుబోతు అని.. తన వద్ద పని చేసే వారిని బాగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో గొప్పలకు పోయి వారి చేతిలోనే మోసపోయిన వ్యక్తి అంటూ ఆమెను బాగా దగ్గర నుండి చూసిన వారు అంటూ ఉంటారు.
ఆమె జయంతి సందర్బంగా ప్రముఖ సీనియర్ నటుడు గుమ్మడి గతంలో చెప్పిన మాటలు ఈ సందర్బంగా ప్రస్థావనకు వస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ నేను ఒకసారి అనారోగ్యంతో ఉన్న సమయంలో నన్ను చూసేందుకు సావిత్రి వచ్చింది. ఇండస్ట్రీలో సూర్యకాంతం తర్వాత సావిత్రి మాత్రమే నన్ను అన్నయ్య అనేవారు. సావిత్రి వచ్చిన సమయంలో డాక్టర్ నాకు మత్తు కోసం ఇంజక్షన్ వేశాడు. మత్తులో ఉన్న నన్ను ఆమె చూసి వెళ్లి పోయింది. ఆ సమయంలో నా తల దిండు వద్ద సర్దినట్లుగా అనిపించింది. నాకు మెలుకువ వచ్చిన తర్వాత చూస్తే తల కింద రెండు వేల రూపాయలు ఉన్నాయి.
ఇబ్బందుల్లో ఉన్న సావిత్రి ఈడబ్బు ఎందుకు ఇచ్చినట్లుగా అనుమానం వచ్చి ఫోన్ చేశాను. గతంలో ఒకసారి మీ వద్ద రెండు వేల రూపాయలు తీసుకున్నాను. నేను చనిపోయే లోపు ఆ డబ్బు ఇవ్వాలనుకున్నా అన్నయ్య. అందుకే ఆ డబ్బును మీకు ఇచ్చేశాను. ఆమె అర్థిక పరిస్థితి కష్టంగా ఉంది. అయినా కూడా ఎప్పుడో ఇచ్చిన డబ్బు గురించి నేను అడుగకున్నా కూడా ఇచ్చింది అంటే ఆమె గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్.. చెన్నైలతో పాటు పలు ప్రాంతాల్లో ఆమెకు ఆస్తులు ఉండేవి. అప్పుడే వందల కోట్ల రూపాయల ఆస్తులు అంటే అవి ఇప్పుడు వేల కోట్లను మించి ఉండేవి. కాని నమ్మిన వారు మోసం చేయడంతో ఆమె ఆస్తులు ఆరతి కర్పూరం అయ్యాయి అన్నాడు. ఆస్తులు పోయి చివరకు కారు షెడ్డులో ఏడాది పాటు ఉన్నా ఆమె పరిస్థితి దయనీయం అంటూ గుమ్మడి ఆవేదన వ్యక్తం చేశారు.