Begin typing your search above and press return to search.
మెగా క్రేజ్ తో వీకెండ్ లాగించేస్తున్న 'ఆచార్య'
By: Tupaki Desk | 1 May 2022 1:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆచార్య సినిమా కు మిశ్రమ స్పందన వచ్చింది. నెగటివ్ రివ్యూలు వచ్చినా మెగా ఫ్యాన్స్ కు చిరంజీవి, చరణ్ కాంబో సన్నివేశాలు కన్నుల విందుగా ఆచార్య నిలిచాయి అంటూ టాక్ దక్కింది. చిరంజీవి మరియు చరణ్ కలిసి నటించడంతో టాక్ తో సంబంధం లేకుండా సినిమా ను చూడాలని భావిస్తున్న మెగా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.
మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తండ్రి కొడుకులు అది కూడా మెగాస్టార్ చిరంజీవి మరియు చరణ్ కలిసి నటించిన సినిమా అవ్వడంతో ఒక సారి థియేటర్ లో చూడాలని ఆశపడుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అందుకే మొదటి రోజు అభిమానుల సందడితో మంచి వసూళ్లు నమోదు అవ్వగా వీకెండ్స్ అయిన శని మరియు ఆదివారాల్లో మంచి బుకింగ్స్ నమోదు అవుతున్నాయి.
శుక్రవారం సినిమకు ఉన్న హైప్ కారణంగా భారీగా ఓపెనింగ్స్ దక్కించుకోగా.. శని.. ఆదివారాల్లో కూడా భారీగానే అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లుగా బాక్సాఫీస్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. చిరంజీవి మరియు చరణ్ నటించిన సినిమా అవ్వడం వల్ల ఒకసారి చూద్దాం అనుకునే వాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల మంచి వీకెండ్ కలెక్షన్స్ నమోదు అవ్వబోతున్నాయి.
సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చినా.. బ్యాడ్ టాక్ వచ్చినా కూడా వాటిని కొందరు జనాలు పట్టించుకోకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి మూడు రోజుల్లో భారీ వసూళ్లు నమోదు అవ్వడంలో మెగా ఇమేజ్ బాగానే ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి వీకెండ్ లో మంచి వసూళ్లను రాబడితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉన్నా కాస్త గౌరవప్రథమైన వసూళ్లు ఆచార్య సొంతం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కు చాలా నెగటివ్ టాక్ వచ్చినా.. డిజాస్టర్ అంటూ కొందరు కామెంట్స్ చేసినా కూడా చిరంజీవి మరియు చరణ్ కాంబోకు ఉన్న క్రేజ్ తో ఒక మోస్తరు వసూళ్లు అయితే నమోదు అవుతున్నాయి.