Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ మ్యాన్-2' రిలీజ్ టైం వచ్చేసింది.. ఎప్పుడంటే??

By:  Tupaki Desk   |   24 April 2021 11:30 AM GMT
ఫ్యామిలీ మ్యాన్-2 రిలీజ్ టైం వచ్చేసింది.. ఎప్పుడంటే??
X
దక్షిణాది స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత.. మొదటిసారి ఓ వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అరంగేట్రం చేయనుంది. 'ది ఫ్యామిలీ మ్యాన్-2' అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ తో సమంత అడుగుపెడుతోంది. నిజానికి సమంత వెబ్ సిరీస్ చేస్తుందని తెలియగానే ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోయాయి. ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఫిబ్రవరిలో విడుదల అవుతుందని ఆశగా వెయిట్ చేశారు కానీ వారికీ నిరాశే మిగిలింది. 2019 సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. పార్ట్ వన్ హిట్ అయినప్పుడే మేకర్స్ సెకండ్ సీజన్ కూడా ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2 మొదలైంది. ఈ మోస్ట్ అవెయిటింగ్ వెబ్ సిరీస్ మొత్తానికి విడుదలకు సిద్ధమైంది.

ఫిబ్రవరి నుండి మేకర్స్ విడుదల తేదీని వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ వెబ్ సిరీస్ మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. అలాగే సౌత్ స్టార్ సమంత నటిస్తుంది కాబట్టి ఈసారి ఫ్యామిలీ మ్యాన్ తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో మనోజ్ బాజ్‌పేయి ఎన్‌ఐఏ ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా నటించగా.. ఆయనకు వ్యతిరేకంగా సమంత ఉగ్రవాది పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇప్పటికే టీజర్ తో మేకర్స్ భారీ అంచనాలను క్రియేట్ చేశారు. సమంత రాజీ అనే పాత్రలో నటించింది. ఇటీవల తాండవ్, మీర్జాపూర్ వెబ్ సిరీసులు వివాదాలతో సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లాయి. అందుకే ఈ సిరీస్ మేకర్స్ వివాదాస్పద సన్నివేశాలను రీషూట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.