Begin typing your search above and press return to search.

ఒకటి రెండు సినిమాలతోనే పేరు ప్రఖ్యాతలు

By:  Tupaki Desk   |   6 Dec 2015 1:00 AM IST
ఒకటి రెండు సినిమాలతోనే పేరు ప్రఖ్యాతలు
X
సినిమా రంగంలో 24క్రాఫ్ట్స్ లోనూ అత్యంత క్లిష్టమైన క్రాఫ్ట్ నిర్మాణం. మిగిలిన క్రాఫ్ట్ లకు పని తెలిసుంటే చాలు కానీ నిర్మాతకు మాత్రం పని, పైసలతో పాటూ సినిమాపై పిచ్చి ప్రేమ కలిగి వుండాలి. లేకపోతే ఎంత తొందరగా మనపేరు వినిపిస్తుందో అంతే తొందరగా కనుమరుగైపోతుంది. అయితే ఇటీవల మొదలవుతున్న కొన్ని నిర్మాణ సంస్థలు ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్ కి వెళ్ళిపోవడం ఆశ్చర్యకరం.

ఎన్నో సినిమాలను తెరకెక్కిస్తేగానీ రామోజీ రావుగారి ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళలేదు డజను హిట్లిచాకే రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్స్ పేరు అందరికీ తెలిసొచ్చింది. అక్కినేని వారి అన్నపూర్ణ సంస్థ సైతం ఈ జాబితాకే చెందింది. అయితే ఇప్పుడిప్పుడే మొలుస్తున్న కొన్ని నిర్మాణ సంస్థలు పేరు కోసం అంతసేపు వేచి వుండనవసరంలేకపోవడం ఆనందకరం.

జక్కన్నతో మర్యాద రామన్న సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ మూడవ చిత్రంగా బాహుబలి వంటి సినిమాను నిర్మించి వార్తలలో నిలిచింది. సాయి కొర్రపాటి వారాహి సంస్థ చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు శ్రీమంతుడు ని అందించిన మైత్రీ మూవీస్ సంస్థ కూడా అంచలంచెలుగా ఎదుగుతుందని సమాచారం. ప్రస్తుతం కొరటాల - తారక్ ల ప్రాజెక్ట్ ని నిర్మిస్తునే తదుపరి త్రివిక్రమ్ - పవన్ ల పై కన్నేసినట్టు తెలుస్తుంది.