Begin typing your search above and press return to search.
ఓటీటీ సినిమాల ప్రమోషన్స్ లైట్ తీసుకుంటున్నారా...?
By: Tupaki Desk | 31 July 2020 7:00 AM ISTకరోనా మహమ్మారి కారణంగా గత నాలుగు నెలలుగా థియేటర్స్ క్లోజ్ అయి ఉన్నాయి. దీంతో ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా ప్రేక్షకులకు తెలియడం లేదు. ఒకప్పుడు థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు ఏదొక విధంగా మూవీని ప్రమోట్ చేస్తూ హడావిడి చేసేవారు. ప్రొడ్యూసర్స్ కూడా పబ్లిసిటీ కోసం సపరేట్ బడ్జెట్ కేటాయించేవారు. అయితే ఇప్పుడు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల పబ్లిసిటీని లైట్ తీసుకుంటున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత బాగుందని టాక్ బాగా వస్తే వ్యూస్ అవే వస్తాయని.. మళ్ళీ పబ్లిసిటీ కోసం ఖర్చు చేయడం దేనికి అని భావిస్తున్నారట. అయితే కొన్ని సినిమాలకు ఓటీటీలు బాగానే ప్రమోషన్స్ చేస్తున్నాయి. కాకపోతే కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ప్రాంతీయ సినిమాలని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఏదో సినిమాని వదిలించేసుకున్నాం అనే పద్ధతిలో నిర్మాతలు వ్యవహరిస్తుంటే.. మనుకున్న లైబ్రరీలో మరొక సినిమా వచ్చి చేరింది అనే రీతిన ఓటీటీ వారు వ్యవహరిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాలు ''కృష్ణ అండ్ హిజ్ లీల'' ''భానుమతి అండ్ రామకృష్ణ'' ఎప్పుడు రిలీజ్ అయ్యాయో చాలా మందికి తెలియదు. కానీ అవి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత వ్యూస్ పెరిగాయి. ఈ క్రమంలో నేడు 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' అనే సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని చాలా మందికి తెలియదు.
'మహేషింతే ప్రతీకారం' అనే మలయాళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ మరియు మహాయాణ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి ఈ సినిమాని నిర్మించారు. 'బాహుబలి' సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ అయినప్పటికీ 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. పాజిటివ్ టాక్ వస్తే పబ్లిసిటీ చేయొచ్చని ప్రొడ్యూసర్స్ మరియు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ భావిస్తున్నాయేమో..!