Begin typing your search above and press return to search.
థియేటర్లకు జనాలను రప్పించడం కోసం అలాంటి నిర్ణయం తీసుకున్నారా..?
By: Tupaki Desk | 31 Oct 2020 12:40 PM ISTకరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పీరియన్స్ కి దూరమయ్యారు. ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే కొత్త సినిమా కోసం ఎదురు చూసే సినీ అభిమానులు.. ఇప్పుడు హోమ్ స్క్రీన్ లో ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాలతో సరిపెట్టుకున్నారు. లాక్ డౌన్ టైంలో థియేటర్స్ మూతపడడంతో ఓటీటీలు పుంజుకున్నాయి. ఈ క్రమంలో జనాలు థియేటర్స్ కి వెళ్లకుండానే ఓటీటీ ద్వారా లభించే ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడిపోయారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ రీ ఓపెన్ చేసినా ఒకప్పటిలా ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ తెరుచుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయినప్పటికీ సినిమా హాళ్లు తెరవడానికి థియేటర్స్ ఓనర్స్ ముందుకు రావడం లేదు. ఇక సినిమాలు రిలీజ్ చేయడానికి మేకర్స్ కూడా వెనుకడుగు వేస్తున్నారు. దీపావళి నుంచి ఓపెన్ చేస్తామని ఎగ్జిబిటర్స్ చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరవడానికి ఈ ఏడాది చివరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది.
థియేటర్స్ తెరిచి సినిమాలు విడుదల చేసినా ప్రేక్షకులు ఏమాత్రం వస్తారన్నదే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయం. కరోనా నేపథ్యంలో థియేటర్స్ ని మర్చిపోయిన జనాలను రప్పించడం ఇప్పుడు ఫిలిం మేకర్స్ ముందున్న అతి పెద్ద సవాలు. వచ్చే ఏడాది సంక్రాంతి సమయానికి పరిస్థితులు చక్కబడతాయని చాలా సినిమాలు ఫెస్టివల్ సీజన్ లో రాబోతున్నట్లు ప్రకటించారు. రవితేజ 'క్రాక్'.. అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. నితిన్ 'రంగ్ దే'.. దగ్గుబాటి రానా 'అరణ్య'.. రామ్ పోతినేని 'రెడ్' వంటి సినిమాలు సంక్రాంతి విడుదల అంటూ అనౌన్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఫిలిం మేకర్స్ అందరూ జనాల్ని థియేటర్స్ కి రప్పించడం కోసం ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పాత రోజుల్లో సినిమాని ప్రమోట్ చేసుకున్నట్లు ఇప్పుడు తమ చిత్రాల ప్రచారం కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఏరియాలలో పర్యటించాలని నిర్ణయించుకున్నారట. లాక్ డౌన్ కి ముందు చిత్ర బృందం ఏదో రెండు మూడు ఇంటర్వూస్ ఇచ్చి ఫిలిం మీడియాకి ఇచ్చేవారు. రిలీజ్ రోజు న్యూస్ ఛానల్స్ కి లైవ్ కి వచ్చి చేతులు దులుపుకునే వారు. కానీ ఇప్పుడు అలా కాకుండా 'మా సినిమా పలానా తేదీన విడుదల అవుతోంది.. థియేటర్స్ కి వెళ్లి చూడండి' అంటూ మెయిన్ సెంటర్స్ కి వెళ్లి ప్రచారం చేస్తారన్నమాట. జనాల్ని సినిమా హాల్స్ కి రప్పించాలంటే ముఖ్యంగా హీరో హీరోయిన్లు ఇలాంటి ప్రచారం చేయకతప్పదని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.