Begin typing your search above and press return to search.

నిర్మాతల‌ కోతలు వారికి మొదలు!

By:  Tupaki Desk   |   30 Aug 2022 10:30 AM GMT
నిర్మాతల‌ కోతలు వారికి మొదలు!
X
ఆగ‌స్టు 1 నుంచి వివిధ కార‌ణాల వ‌ల్ల షూటింగ్ ల‌ని బంద్ చేస్తున్నామంటూ నిర్మాత‌లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. క‌రోనా త‌రువాత నిర్మాణ వ్య‌వ‌యం పెరిగింద‌ని, అంతే కాకుండా ఓటీటీ ల ప్ర‌భావం, టికెట్ రేట్ల పెరుగుద‌ల‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు భారీగా పెరిగాయంటూ వివిధ కార‌ణాల‌తో ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే షూటింగ్ ల బంద్ పాటిస్తున్నామంటూ ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత ప్ర‌త్యేకంగా ఒక్కొ శాఖ‌తో ఒక్కో స‌మ‌స్య‌పై చ‌ర్చిస్తూ ప‌రిష్క‌రం క‌నుగొంటూ ముందుకు సాగుతున్నారు.

పెరిగిన బ‌డ్జెట్ ని కంట్రోల్ చేయ‌డం కోసం ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నాలు చేయాలో అన్ని విధాలుగా నిర్మాత‌ల మండ‌లి, ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ స‌భ్యులు ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల హీరోయిన్ ల మేనేజ‌ర్ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయిన నిర్మాత‌లు ప‌లు కీల‌క అంశాల‌పై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వారి వ్య‌క్తిగ‌త సిబ్బంది ప్ర‌యాణ ఖ‌ర్చుల‌తో పాట ఫుడ్ ఖ‌ర్చులు కూడా హీరోయిన్ రెమ్యున‌రేష‌న్ లోనే భ‌రించాల‌ని తాజాగా నిర్మాత‌లు నిర్ణ‌యించారు.

అంత‌కు ముందే `మా` అసోసియేష‌న్ తో, `మా` అధ్య‌క్షుడితో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై ఆర్టిస్ట్ ల రెమ్యున‌రేష‌న్ లు , అద‌న‌పు సిబ్బంది ఖ‌ర్చుల‌పై చ‌ర్చించడం తెలిసిందే. ఇప్ప‌డు ప్ర‌ధానంగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల‌పై చ‌ర్చ మొద‌లైంది. కొంత మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు క్యార‌వాన్‌, ప్ర‌త్యేక ఫుడ్‌, వ్య‌క్తిగ‌త సిబ్బంది, లొకేష‌న్ కు చేరుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా కార్ ని డిమాండ్ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యాల్లో నిర్మాత‌లు తాజాగా కోత‌లు విధించిన‌ట్టుగా తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో నిర్మాత‌లు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు, హీరోయిన్ ల మ‌ద‌ర్, వ్య‌క్తిగ‌త సిబ్బంది బేటాలు, ప్ర‌త్యేక రూమ్‌, విమాన ప్ర‌యాణ ఖ‌ర్చుల విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఇవ‌న్నీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు , హీరోయిన్ లు త‌మ పారితోషికాల నుంచే భ‌రించాలి. నిర్మాత‌లు ప్ర‌త్యేకంగా ఏమీ ఇవ్వ‌రు. అంతే కాకుండా పుడ్ విష‌యంలోనూ క‌ఠినంగా వుండాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. సెట్ లో ప్రొడ‌క్ష‌న్ ఫుడ్ కాకుండా బ‌య‌టి నుంచి ఫుడ్ తెప్పించమ‌ని ఇంత కాలం హీరోయిన్ లు, వారి సిబ్బంది, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు డిమాండ్ చేసేవార‌ట‌.

అయితే తాజాగా తీసుకున్న నిర్ణ‌యంలో ఇది కూడా క‌ట్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. ఇక ఇత‌ర రాష్ట్రాల నుంచి ముంబై, గోవా.. లేదా ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే హీరోయిన్ లు వారి ఫ్లైట్ ఛార్జీల‌తో పాటు వ‌స‌తికి సంబంధించిన ఏర్పాట్లు వారే చూసుకోవాలి. ఆ ఖ‌ర్చులు వారే భ‌రించాలి. అంతే కాకుండా వ్య‌క్తిగ‌త సిబ్బంది వుంటే వారి ఖ‌ర్చు లతో నిర్మాత‌ల‌కు ఎలాంటి సంబంధం వుండ‌దు. వారి ఖ‌ర్చులు కూడా హీరోయినే భ‌రించాలి.

లేదంటే ఇక్క‌డి వారిని అరేంజ్ చేసుకోవాలి. వంటి కీల‌క నిర్ణయాల‌ని ప్రొడ్యూస‌ర్స్ తాజాగా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా హీరోల పారితోషికాల‌పై కూడా చ‌ర్చ జ‌రుగుతున్న వారిని ఈ విష‌యంలో అడిగే వారు లేర‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్, ప్ర‌భాస్ త‌ప్ప మ‌రే హీరో పారితోషికాలు త‌గ్గించుకోవ‌డానికి తాము సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించ‌లేద‌ని తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.