Begin typing your search above and press return to search.

నయన్‌ నిర్ణయం తో నిర్మాతలు హ్యాపీ

By:  Tupaki Desk   |   14 Feb 2020 1:30 AM
నయన్‌ నిర్ణయం తో నిర్మాతలు హ్యాపీ
X
ప్రస్తుతం సౌత్‌ ఇండియాలో స్టార్‌ హీరోయిన్‌ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో నయనతార పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈ అమ్మడు తెలుగు మరియు తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తోంది. స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌ గా నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటిస్తూ ఉంది. సినిమాల్లో నటించడం వరకే తన పని ప్రమోషన్స్‌ తాను పట్టించుకోను అంటూ ఈ అమ్మడు ముందే చెప్తుంది. అయినా కూడా ఈమెనే కావాలని చాలా మంది నిర్మాతలు మరియు దర్శకులు ఈమెతో వర్క్‌ చేస్తున్నారు.

కెరీర్‌ ఆరంభంలో ఈ అమ్మడు స్కిన్‌ షో చేసింది. బికినీల్లో కూడా నటించింది. కాని గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈమె చాలా పద్దతైన కాస్ట్యూమ్స్‌ మాత్రమే ధరిస్తుంది. అవకాశాలు భారీగా ఉన్నప్పుడు విప్పాల్సిన అవసరం ఏముందని భావించిందో లేక మరేంటో కాని ఈ అమ్మడు ఇన్నాళ్ల చీరలు లేదంటే చుడిదార్‌ లతో ఒల్లంతా కూడా కప్పుకునే నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడికి కాస్త ఆఫర్లు తగ్గాయి. దాంతో కాస్ట్యూమ్స్‌ విషయంలో తాను పెట్టుకున్న బౌండరీలను తూడ్చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

నయనతార పొట్టి డ్రస్‌ లు వేసుకోవడంతో పాటు రొమాంటిక్‌ సీన్స్‌ లో నటించేందుకు మరియు స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తే బికినీ ఇంకా ముద్దు సీన్స్‌ కు కూడా ఓకే అంటుందట. ఈమె నిర్ణయంతో పలువురు నిర్మాతలు ఆమెను బుక్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారు. అడ్వాన్స్‌ లు పట్టుకుని తిరుగుతున్నారట. ఈ మంచి నిర్ణయం తీసుకున్న నయనతార ప్రమోషన్స్‌ విషయంలో కూడా తన పద్దతి మార్చుకుంటే బాగుంటుంది కదా అంటూ కొందరు నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆఫర్లు ఇంకా తగ్గిన సమయంలో ఆ నిర్ణయాన్ని కూడా ఈ అమ్మడు మార్చుకోవచ్చేమో..!