Begin typing your search above and press return to search.
ప్రభాస్ క్రేజ్ ని భలే క్యాష్ చేసుకుంటున్నారు..!
By: Tupaki Desk | 27 Jun 2021 8:00 AM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందారు. తెలుగులో నిరాశ పరిచిన 'సాహో' మూవీతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న ప్రభాస్.. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ పాపులర్ హీరో అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో డార్లింగ్ క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ ద్వారా తమ సినిమాలకు ప్రమోషన్స్ చేయించుకొని లాభాలు పొందాలని చూస్తున్నారు.
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ తో తమ సినిమాలకు సంబంధించిన కంటెంట్ ని జానాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రభాస్ సోషల్ మీడియా మాధ్యమాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమై పోతుంది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ప్రతీ దానికి డార్లింగ్ తన వంతు సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు 'మత్తు వదలరా' 'గుడ్ లక్ సఖీ' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' 'ఆకాశం నీ హద్దురా' 'ఓ పిట్ట కథ' 'థాంక్ యి బ్రదర్' 'యువరత్న' 'జాంబీరెడ్డి' 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' 'జాతిరత్నాలు' అరణ్య' 'శ్రీకారం' 'మోసగాళ్ళు' 'తెల్లారితే గురువారం' 'ఏక్ మినీ కథ' 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' వంటి సినిమాలకు ప్రభాస్ తన తోడ్పాటునందించారు.
ప్రభాస్ మంచితనంతో మిగతా సినిమాలకు తన వంతు సహాయం చేయడం మంచిదే అయినప్పటికీ.. దీని కారణంగా అతని బ్రాండ్ వాల్యూకు ఇబ్బందులు వస్తాయేమో అని డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇలా ప్రతి సినిమాకి ఫ్రీ ప్రమోషన్స్ చేస్తూ పోతే ఎండార్స్మెంట్ వాల్యూ పడిపోతుందని ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. అయితే చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలుస్తున్న ప్రభాస్ ను ఇండస్ట్రీలోని అన్ని వర్గాల వారు అభినందిస్తున్నారు.