Begin typing your search above and press return to search.

నిర్మాత‌ల్ని కొన‌లేదు! తండ్రి బోనీపై జాన్వీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

By:  Tupaki Desk   |   24 Oct 2022 4:15 AM GMT
నిర్మాత‌ల్ని కొన‌లేదు! తండ్రి బోనీపై జాన్వీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!
X
వ‌రుస‌గా ప్ర‌యోగాలు చేస్తూ న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఓవైపు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టిస్తూనే నాయికా ప్రాధాన్య పాత్ర‌ల‌తోనూ మెరిపిస్తోంది. ఇటీవ‌ల నేరుగా OTTలో విడుదలైన 'గుడ్ లక్ జెర్రీ'లో జాన్వీ కపూర్ తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు త‌ను న‌టించిన 'మిలీ' రిలీజ్ ప్ర‌చారంలో బిజీ బిజీగా ఉంది. ఈ చిత్రం నవంబర్ 4న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. మలయాళ చిత్రం హెలెన్ కి ఇది అధికారిక రీమేక్.

ప్రస్తుతం జాన్వీ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ చాటింగ్ సెష‌న్ లో బాలీవుడ్ బంధుప్రీతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జాన్వీ మాట్లాడుతూ- "తన చలనచిత్ర నేపథ్యం తనకు ప్రారంభ సినిమాలు రావడానికి సహాయపడిందని అయితే ఆ తర్వాత తన యోగ్యత ప్రతిభ ఆధారంగానే తనకు అవకాశాలు లభించాయ"ని చెప్పింది. స్టార్ కిడ్ ని లాంచ్ చేసి ఆర్థికంగా నష్టపోవడానికి ఏ నిర్మాత ఆసక్తి చూపరని కూడా ఆమె స్పష్టం చేసింది. నిర్మాతలను కొనడానికి తనకు తన తండ్రికి అంత పెద్ద డబ్బు లేదని కాబట్టి వారు తనను నటింపజేసే ఛాయిస్ ఉంద‌ని జాన్వీ పేర్కొంది. త‌దుప‌రి రాజ్‌కుమార్‌రావుతో మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే మరో సినిమా కూడా చేస్తోంది. అలాగే వరుణ్ ధావన్ 'బవాల్‌'లో జాన్వీ కథానాయికగా న‌టిస్తోంది.

ఆక‌ట్టుకున్న మిలీ ట్రైల‌ర్ కోల్డ్ స్టోరేజ్ గొడౌన్ (ఫ్రీజ‌ర్) లో లాక్ అయిపోయిన ఒక అంద‌మైన అమ్మాయి బతుకు పోరాటం నేప‌థ్యంలో 'మిలీ' త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నిజ‌ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన చిత్ర‌మిది. చ‌లికి గ‌డ్డ‌క‌ట్టిపోయే స‌న్నివేశంలో జాన్వీ క‌పూర్ ఎలాంటి పోరాటం సాగిస్తోందో ట్రైల‌ర్ లో వీక్షించాం. గ‌గుర్పొడిచే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మిలీ ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది.

ఫ్రీజర్ లో చిక్కుకున్న మిలీ ప్రాణాలను కాపాడుకోవడానికి కాలంతో ఎలా ప‌రిగెత్తిందో తెర‌పై చూడాల్సిందే. మిలీ నుండి వ‌రుస ఫోటోలు వీడియోల‌ను జాన్వీ షేర్ చేస్తూ ప్ర‌చారం హోరెత్తిస్తోంది. వీటి ద్వారా అంత‌కంత‌కు అభిమానుల ఉత్సుకతను రేకెత్తిస్తోంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని మొదట మలయాళంలో నిర్మించారు. ఇప్పుడు హిందీ వెర్ష‌న్ విడుద‌ల‌వుతోంది.

రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ అంద‌మైన అమ్మాయి మనుగడ నేప‌థ్యంలో చిల్లింగ్ స్టోరీని ఎలివేట్ చేసింది. ఇక ఇదే ట్రైలర్ లో జాన్వీ కపూర్ పోషించిన మిలీ వెనుక అస‌లు కథ ఆస‌క్తిక‌రం. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తన తండ్రి బోనీతో క‌లిసి న‌టించ‌డం ఆస‌క్తిక‌రం. తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని ఇందులో ఆవిష్క‌రించారు. మిలీ తన తండ్రితో స్నేహపూర్వక బంధాన్ని పంచుకోవడం .. తాను ఎంత‌గానో ప్రేమించే నాన్న‌ను వ‌దిలి కెనడాకు వెళ్లాలనే ఆమె నిర్ణయం వ‌గైరా వ‌గైరా ట్విస్టులు మిలీ ట్రైల‌ర్ లో ఉత్కంఠ‌ను పెంచాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.