Begin typing your search above and press return to search.

హీరోయిన్ ల ఎక్స్‌ట్రాల‌కు ప్రొడ్యూస‌ర్స్ చెక్!

By:  Tupaki Desk   |   25 Aug 2022 5:30 AM GMT
హీరోయిన్ ల ఎక్స్‌ట్రాల‌కు ప్రొడ్యూస‌ర్స్ చెక్!
X
టాలీవుడ్ లో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్, నిర్మాత‌ల మండ‌లి తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం షూటింగ్ ల బంద్‌. గ‌త కొంత కాలంగా టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ ఎదుర్కొంటున్న వివిధ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా దృష్టిపెట్టి వాటిని ప‌రిష్క‌రించుకోవాల‌న్న నిర్ణ‌మంతో షూటింగ్ ల బంద్ కు పిలుపునిచ్చారు. షూటింగ్ ల బంద్ ప్ర‌క‌టించి దాదాపు నెల కావ‌స్తోంది. ఈ నెల రోజుల్లో ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై ప్రొడ్యూసర్స్ క్ర‌మ క్ర‌మంగా ప‌ట్టు సాధించ‌డం మొద‌లు పెట్టారు.

ఆర్టిస్ట్ ల రెమ్యున‌రేష‌న్ లు, పెరిగిన నిర్మాణ వ్య‌యం, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు, హీరోయిన్ ల అద‌న‌ప ఖ‌ర్చులు, వ్య‌క్తిగ‌త సిబ్బంది, మేక‌ప్ మెన్ ఖ‌ర్చులు, వారి కోసం ప్ర‌త్యేకంగా రూమ్ లు, మ‌ద‌ర్ వుంటే మ‌ద‌రు ప్ర‌త్యేక‌మైన ఫుడ్‌, ఆమె ప్ర‌యాణ ఖ‌ర్చులు, ఫ్లైట్ టికెట్ లు, హీరోయిన్ తో వ‌చ్చే వ్య‌క్తిగ‌త సిడ్డంది ఫ్లైట్ ఖ‌ర్చులు, భోజ‌నం, ప్ర‌త్యేక బేటాలు, ప్ర‌త్యేకంగా రూమ్ లు వీటిపై కూడా ప్ర‌ధానంగా చ‌ర్చించ‌డం మొద‌లు పెట్టారు.

తాజాగా హీరోయిన్ ల మేనేజ‌ర్ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించిన ప్రొడ్యూసర్లు హీరోయిన్ ల వ్య‌క్తిగ‌త సిబ్బంది ఫ్లైట్ ఛార్జీలు, వారి రూమ్ ఖ‌ర్చులు, మ‌ద‌ర్ వెంట వ‌స్తే ఆమె ఫ్లైట్ ఖ‌ర్చులు, హోట‌ల్ బిల్లులు వైగైరా వాటిపై కూడా కూలంక‌శంగా చ‌ర్చించార‌ట‌.

ఇక‌పై ఇలాంటి అద‌న‌పు ఖ‌ర్చులు, ప్ర‌త్యేక‌మైన ఫుడ్ ఇలాంటివి అన్నీ హీరోయిన్ కు అందించే రెమ్యున‌రేష‌న్ లోనే భరించాల్సి వుంటుంద‌ని నిర్మాత‌లు తాజాగా వారి మేనేజ‌ర్ల‌తో జ‌రిగిన ప్ర‌త్యేక భేటీలో ఖ‌రాకండీగా చెప్పిన‌ట్టు తెలుస్తోంది. దీంతో హీరోయిన్ ల ఎక్స్‌ట్రాల‌కు ప్రొడ్యూస‌ర్స్ చెక్ పెట్టిన‌ట్టయింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఈ మ‌ధ్య కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త‌ల్లి ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. గ‌త కొంత కాలంగా త‌న కూతురు స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ని ఎంజాయ్ చేస్తుండ‌టంతో స‌ద‌రు హీరోయిన్ త‌ల్లి సెట్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాద‌ని తెలుస్తోంది. ప్ర‌తీ విష‌యంలో ద‌బాయించి మ‌రీ హీరోయిన్ త‌ల్లి ప్రొడ్యూస‌ర్ల‌ని డిమాండ్ చేసేద‌ట‌. అయితే స‌ద‌రు క్రేజీ హీరోయిన్ కు ఈ మ‌ధ్య బ్యాక్ టు బ్యాక్ వ‌రుస‌గా ఫ్లాపులు త‌గిలే స‌రిగి సెట్ లో హ‌డావిడి చేసే ఆ హీరోయిన్ త‌ల్లి సైలెంట్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. వ‌రుస ఫ్లాపుల కార‌ణంగానే త‌ను కామ్ అయిపోయింద‌ని చెబుతున్నారు.

తాజాగా ప్రొడ్యూస‌ర్స్‌ తీసుకున్న నిర్ణ‌యం కూడా స‌ద‌రు హీరోయిన్ కు , ఆమె త‌ల్లికి బిగ్ సాక్ ఇచ్చిన‌ట్టుగా చెబుతున్నారు. స‌ద‌రు హీరోయిన్ సినిమా ప్ర‌మోష‌న్స్ లోనూ ఆమె త‌ల్లి యాక్టీవ్ గా పాల్గొంటూ నిర్మాల‌ని బాగానే డిమాండ్ చేసేద‌ట‌. అయితే వున్న‌ట్టుండి త‌న కూతురు న‌టించిన సినిమాలు పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డం.. వ‌రుస‌గా ఫ్లాప్ అవుతుండ‌టంతో త‌న‌తో బ‌య‌టికి, సెట్స్ కి రావ‌డానికే ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని ఇన్ సైడ్ టాక్‌.