Begin typing your search above and press return to search.

య‌ష్ ఫ్యాన్స్ కు షాక్‌..రాఖీభాయ్ మారుతున్నాడా?

By:  Tupaki Desk   |   9 Jan 2023 5:30 PM GMT
య‌ష్ ఫ్యాన్స్ కు షాక్‌..రాఖీభాయ్ మారుతున్నాడా?
X
రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా న‌టించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ పై విజ‌య్ కిర‌గందూర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృస్టించింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుద‌లైన ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఫ‌స్ట్ చాప్ట‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో పార్ట్ 2పై అంచ‌నాలు ఏర్ప‌డ‌టం.. దానికి త‌గ్గ‌ట్టే సినిమా వుండ‌టంతో ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బాక్సాఫీస్ వ‌ద్ద బ్ర‌హ్మర‌థం ప‌ట్టారు.

ఊహించ‌ని క్రేజ్ కార‌ణంగా ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఇక పార్ట్ 2 ఎండింగ్ లో పార్ట్ 3 వుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించ‌డంతో పార్ట్ 3 పై అంచ‌నాలు నెల‌కొన్నాయి. మూడ‌వ భాగం ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా?.. అప్ డేట్ ఎప్పుడొస్తుందా? అని అభిమానులు గ‌త కొన్ని రోజులుగా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. హీరో య‌ష్ పుట్టిన రోజైన జ‌న‌వ‌రి 8న దీనికి సంబంధించిన అప్ డేట్ వ‌స్తుంద‌ని భావించారు.

అయితే హీరో య‌ష్ నుంచి కానీ, మేక‌ర్స్ నుంచి కానీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ పార్ట్ 3 ప అప్ డేట్ ఇచ్చేశారు. 2025లో చాప్ట‌ర్ 3 సెట్స్ పైకి వెళుతుంద‌ని వెల్ల‌డించి ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేశారు. అయితే సినిమా మాత్రం 2026 త‌రువాతే రిలీజ్ అవుతుంని స్ప‌ష్టం చేశారు. సీక్వెల్ కోసం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా మొద‌లు పెట్ట‌లేద‌న్నారు. అంతే కాకుండా జేమ్స్ బాండ్ సినిమాల‌కు వేర్వేరు హీరోలు మారుతుంటార‌ని, కేజీఎఫ్ సీక్వెల్స్ కి కూడా వేర్వేరు హీరోలు ఉంటార‌ని షాకిచ్చారు.

కేజీఎఫ్ మూవీకి మొత్తం ఐదు సీక్వెల్స్ వుంటాయ‌ని అయితే ఒక్కో సీక్వెల్ కు ఒక్కో హీరో మారుతుంటాడ‌ని స్ప‌ష్టం చేశారట‌. అయితే త‌న ఆలోచ‌న బాగానే వున్నా య‌స్ ని ఊహించుకున్న వాళ్లు ఇత‌ర హీరోల‌కు క‌నెక్ట్ కావ‌డం.. ఆ ప్ర‌పంచంలోకి ట్రావెల్ కావ‌డం జ‌రిగే ప‌నేనా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాఖీభాయ్ లేకుండా `కేజీఎఫ్` సీక్వెల్స్ అంటే ఊహించుకోవ‌డ‌మే క‌ష్ట‌మే.. మ‌రి ప్రేక్ష‌కులు ఇలాంటి సీక్వెల్స్ ని అంగీక‌రిస్తారా? .. ఆ స్థాయిలో ఆద‌రిస్తారా? అన్న‌ది అనుమాన‌మే.

ఇక `కేజీఎఫ్ 3` ఆల‌స్యానికి కార‌ణం ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో `స‌లార్‌` మూవీ చేస్తున్నాడు. ఇది ఇంకా పూర్తి కాలేదు. అందే కాకుండా ఈ మూవీ త‌రువాత ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి వుంది. ఈ రెంగు పూర్తి కావ‌లంటే 2025 అవుతుంది. అందుకే పార్ట్ 3ని 2025లో ప్రారంభిస్తామ‌ని నిర్మాత చెప్పిన‌ట్టుగా నెట్టింట ఓ వార్త‌ వైర‌ల్ గా మారింది. ఇదే నిజ‌మైతే య‌ష్ అభిమానుల‌కు బిగ్ షాక్ అని అని ప్ర‌చారం జ‌రుగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.