Begin typing your search above and press return to search.

పవన్ గారూ.. సాయం చేయండి ప్లీజ్

By:  Tupaki Desk   |   5 Sept 2017 10:41 AM IST
పవన్ గారూ.. సాయం చేయండి ప్లీజ్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. తాను చెప్పదలుచుకున్న మాటలను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తుంటారు. మీడియాకు తన అభిప్రాయం చెప్పదలుచుకున్నా ట్వీట్ల ద్వారానే చెబుతుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ సహాయం అర్ధిస్తూ ఓ మహిళ ట్వీట్టర్ లో మెసేజ్ పెట్టింది. ఎవరో మామూలు మహిళ ట్వీట్ చేస్తే పెద్ద ప్రత్యేకత ఉండకపోవచ్చు. కానీ ఈ ట్వీట్ చేసింది గతంలో పవన్ కళ్యాణ్ తో సినిమా తీసిన లేడీ ప్రొడ్యూసర్. తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ నటించిన పంజా సినిమాను నిర్మించిన నీలిమ తిరుమలశెట్టి.

అర్క మీడియా వర్క్స్ అండ్ సంఘమిత్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మరో ముగ్గురు నిర్మాతలతో కలిసి నీలిమ పంజా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. పంజా తర్వాత వెంకట్ రాహుల్ - అనీషా ఆంబ్రోస్ హీరో హీరోయిన్లుగా అలియాస్ జానకి అనే సినిమా తీశారు. ఆ తర్వాత సినిమా రంగానికి దూరంగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఆమె తనకు సహాయం చెయ్యాల్సిందిగా వపన్ ను కోరుతూ ఓ ట్వీట్ పెట్టారు. ‘ప్లీజ్ హెల్ప్ మీ పవన్ కళ్యాణ్ గారూ’ అంటూ ఆమె పెట్టిన ట్వీట్ అభిమానులను ఆశ్చర్య పరిచింది.

పవన్ నుంచి ఏ రకమైన సాయం కోరుతున్నదీ అందులో ఏం చెప్పలేదు. దీంతో ఏం జరిగిందంటూ ట్విట్టర్ లో చాలామంది ప్రశ్నించినా ఆమె సైలెంట్ గా ఉండిపోయారే తప్ప సమాధానం ఇవ్వలేదు. కాకపోతే ఈ ట్వీట్ పై అర్ధరాత్రి వరకు రచ్చ కొనసాగాక.. ఆమె ట్వీట్ డిలీట్ చేసింది.