Begin typing your search above and press return to search.

రూ.20 కోట్లతో కేసీఆర్ బయోపిక్!

By:  Tupaki Desk   |   6 July 2020 11:30 AM GMT
రూ.20 కోట్లతో కేసీఆర్ బయోపిక్!
X
బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో కూడా బయోపిక్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు బయోపిక్స్ వచ్చాయి. క్రీడాకారులు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు చివరకు శాస్త్రవేత్తల బయో పీక్స్ కూడా వచ్చాయి. చాలా కాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ గురించిన వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ ఈ బయోపిక్ ను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. ప్రకటన చేసి చాలా కాలం అయ్యింది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి ముందడుగు పడక పోవడంతో శ్రీధర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడేమో అంటూ టాక్ వినిపిస్తుంది.

ఇటీవల మరోసారి మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది. ప్రస్తుతం కేసీఆర్ గారు జాతీయ స్థాయి నాయకుడు. ఆయన సినిమాను భారీ ఎత్తున నిర్మించాలి. ఆయన బాడీ లాంగ్వేజ్ ను చూపించగల నటుడిని చూస్తున్నాం. అలాంటి వాడు అయితేనే సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నాము. రూ. 20 కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందించాలని అనుకుంటున్నాం. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అందుకోసం చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. బడ్జెట్ కూడా సమకూర్చుకోవాల్సి ఉంది. అందుకే సమయం పడుతుందని అంతే తప్పితే సినిమాను వదిలేయలేదని నిర్మాత క్లారిటీ ఇచ్చాడు.