Begin typing your search above and press return to search.

యువ‌నాయిక కెరీర్ కోసం నిర్మాత సాయం

By:  Tupaki Desk   |   26 April 2022 4:22 AM GMT
యువ‌నాయిక కెరీర్ కోసం నిర్మాత సాయం
X
రంగుల ప్ర‌పంచంలో ప్ర‌తిభ ఉన్నా ల‌క్ క‌లిసి రావాలి. చ‌క్క‌ని ప‌రిచ‌యాలు.. స్నేహితుల నుంచి స‌హాయం కూడా క‌లిసి రావాలి. అలాంటి ల‌క్ త‌న‌కు చిక్కింద‌ని భావిస్తోంది ఇటీవ‌ల టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన‌ ఓ అందాల భామ‌.

ఇద్ద‌రు టాప్ హీరోలు న‌టించిన సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ ప్ర‌తిభ‌ను మెచ్చి త‌న‌కు అవ‌స‌ర‌మైన సాయం చేసేందుకు త‌న నిర్మాత సాయ‌మందిస్తున్నార‌ట‌.

ఆరంభ‌మే విజ‌యం ద‌క్కించుకుని జోరుమీదున్న‌ ఈ భామ‌కు వ‌రుస‌గా డీసెంట్‌ ఆఫర్ లు ద‌క్కుతున్నాయ‌ని తెలిసింది. అందుకోసం ఆ నిర్మాత త‌న వంతుగా స‌హ‌కారం అందిస్తున్నారు.

అయితే వ‌రుసగా అవ‌కాశాలొచ్చినా కానీ నేటిత‌రం దానిని నిల‌బెట్టుకోవ‌డం ఇప్ప‌టి పోటీలో చాలా ఇంపార్టెంట్‌. దానికోసం స‌ద‌రు యువ‌నాయిక‌ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంద‌ని స‌ద‌రు నిర్మాత స‌ల‌హా ఇచ్చార‌ట‌.

నివేద థామ‌స్‌.. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇంత‌కుముందు టాలీవుడ్ లో చ‌క్క‌ని రిలేష‌న్ షిప్‌.. స్నేహాల‌తో అవ‌కాశాలు అందుకున్నారు. కెరీర్ ని తెలివిగా ముందుకు న‌డిపించారు.

అదే త‌ర‌హాలోనే ఈ అమ్మ‌డు కూడా కొన్నాళ్ల పాటు విజ‌య‌వంతంగా కెరీర్ ని సాగిస్తుంద‌నే భావించాలి. ముఖ్యంగా మంచి స్నేహాలతో పాటు.. వ‌ర్క్ ప‌రంగా డెడికేష‌న్ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఎదిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.