Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ ఇన్నాళ్లకు కోలుకున్నాడు
By: Tupaki Desk | 12 July 2016 9:00 PM IST‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి.. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు రాజు. ఐతే నిజానికి ఆ సినిమాకు ఆయనకొక్కడే నిర్మాత కాదు. ఆ ‘దిల్’ అనేది మరో నిర్మాతకు కూడా ఇంటిపేరుగా మారాల్సింది. ఆ నిర్మాత పేరు గిరి. రాజుతో కలిసి ‘దిల్’ సినిమాను నిర్మించి శుభారంభం చేసిన గిరి.. ఆ తర్వాత వరుసగా భారీ సినిమాలు తీశాడు. రాజమౌళి దర్శకత్వంలో ‘సై’ చేశాడు. అది ఓ మోస్తరు ఫలితాన్నిచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఆంధ్రావాలా.. నా అల్లుడు సినిమాల్ని ప్రొడ్యూస్ చేశాడు. వాటి ఫలితం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దెబ్బకు ఇండస్ట్రీ నుంచే అంతర్ధానమైపోయాడు గిరి.
ఐతే ఇన్నేళ్లకు గిరి తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. వ్యాంతేయ ప్రొడక్షన్స్ పేరుతో ఓ కొత్త బేనర్ మొదలుపెట్టి.. చిన్న సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు గిరి. ఆయనతో ఇంకో ఇద్దరు నిర్మాతలు జత కలుస్తున్నారు. తొలి ప్రాజెక్టును త్వరలోనే వెల్లడిస్తారట. దీంతో పాటు గరుడ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇంకో ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కూడా మొదలుపెడుతున్నాడు గిరి. కొన్ని చిన్న సినిమాల శాటిలైట్ హక్కులు తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాతను. పునరాగమనంలో తనకంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్న గిరి.. ఇండస్ట్రీ నుంచి మద్దతు కోరుతున్నాడు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా గిరి నిలదొక్కుకుంటాడేమో చూడాలి.