Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లో విషాదం.. కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి!
By: Tupaki Desk | 30 May 2021 8:00 AM ISTబాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇండియాను పీడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మరణించారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీని ఈ వార్త కుడిపిస్తుంది. గతేడాది కియారా అద్వానీ - వరుణ్ ధావన్ జంటగా నటించిన 'ఇందు కి జవాని' మూవీ ప్రొడ్యూసర్ ర్యాన్ ఇవాన్ స్టీఫెన్ మే 29న అంటే శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. గత ఇరవై రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడి చివరిగా ఈరోజు తెల్లవారి జామున ఆయన మరణించారని సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ర్యాన్ మరణవార్త తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.
ర్యాన్ 'ఇందూ కి జవాని' సినిమాతో పాటు దేవి అనే షార్ట్ ఫిల్మ్ కూడా నిర్మించాడు. అందులో యాక్ట్రెస్ కాజోల్ తో పాటుగా నేహా ధూపియా - శృతిహాసన్ కూడా నటించారు. అయితే ర్యాన్ తన స్నేహితుడు స్క్రీన్ రైటర్ - లిరిక్ రైటర్ నిరంజన్ అయ్యంగర్ తో కలిసి ఎలక్ట్రిక్ ఆపిల్స్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ స్థాపించారు. అలాగే ర్యాన్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ తో కూడా మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ర్యాన్ మరణంతో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన సోషల్ మీడియా ఖాతాలో.. 'రిప్ ర్యాన్' అంటూ ఆయన ఫోటోను పోస్ట్ చేసాడు. అలాగే ర్యాన్ మరణ వార్త తెలిసి హీరోయిన్ కియారా అద్వానీ సోషల్ మీడియా ఖాతాలో 'మా ప్రియమైన ర్యాన్ త్వరగా వెళ్లిపోయాడు' అంటూ హార్ట్ బ్రోకెన్ సింబల్ పోస్ట్ చేసింది.
అలాగే ర్యాన్ మరణం పట్ల యాక్టర్ మనోజ్ బాజపేయ్ స్పందించి.. 'ర్యాన్ గురించి తెలిసిన వారికీ ఇదంతా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇదంతా నిజం కాదేమో.. కానీ నా స్నేహితుడిని బాగా మిస్ అవుతున్నాను.' అంటూ సంతాపం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా భారీగా దెబ్బతీసింది. ఇప్పటికే చాలామంది అభిమాన సెలబ్రిటీలను కోల్పోయారు ప్రేక్షకులు. ప్రస్తుతం ర్యాన్ మరణంతో మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.