Begin typing your search above and press return to search.

నిర్మాత‌గా దిల్ రాజు కోరిక ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   15 Dec 2022 12:30 AM GMT
నిర్మాత‌గా దిల్ రాజు కోరిక ఏంటో తెలుసా?
X
టాలీవుడ్ లో వున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ ల‌లో దిల్ రాజు శైలి ప్ర‌త్యేకం. ఆటోమోబైల్ రంగం నుంచి డిస్ట్రిబ్యూట‌ర్ గా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన ఆయ‌న ఆ త‌రువాత నైజాంలో తిరుగులేని డిస్ట్రిబ్యూట‌ర్ గా పేరు తెచ్చుకున్నారు. అదే త‌ర‌మాలో నిర్మాత‌గానూ టాలీవుడ్ స్టార్ లతో సినిమాలు చేసిన స్టార్ ప్రొడ్యూస‌ర్ అనిపించుకున్నారు. ప్ర‌స్తుతం త‌మిళ హీరో విజ‌య్ తో 'వారీసు'ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగులో 'వార‌సుడు'గా రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని దిల్ రాజు వెల్ల‌డించారు.

ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ తో పాటు ఇండ‌స్ట్రీలో నిర్మాత‌ల స‌మ‌స్య‌ల‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై స్పందించారు. బ‌డ్జెట్ గురించి మాట్లాడుతూ వెయ్యి కోట్ల‌లో ప్రొడ్యూస‌ర్ చేతికి వ‌చ్చేది ఎంత అనే విష‌యం గురించి ఎవ‌రూ మాట్లాడ‌ర‌ని, నిజం మాట్లాడుకుంటే చాలా స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌న్నారు. పెద్ద సినిమా తెలుగులో రూ.200 కోట్ల గ్రాస్ వ‌సూలు చేస్తే 18 శాతం జీఎస్టీ 36 కోట్లు పోతాయ‌ని, దీని గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌ర‌న్నారు. ఇక థియేట్రిక‌ల్ రెంట‌ల్స్ రూపంలో 25% 50 కోట్లు పోతే 200 కోట్ల‌లో 110 కోట్లే డిస్ట్రిబ్యూట‌ర్ చేతికొస్తాయన్నారు.

ఇక క్యార‌వాన్ ల గురించి మాట్లాడుతూ అవి లేకుండా షూటింగ్ లేదు. అవి ఉండ‌టంలో త‌ప్పులేదు. పూర్వం పొల్యూష‌న్ ఉండేది కాదు.. సెల్ ఫోన్లు లేవు. కానీ ఇప్పుడు అలా కాదు. దుస్తులు మార్చుకోవాల‌న్నా క్యార‌వాన్ వుండాలి క‌దా!.. అయితే దీని వ‌ల్ల క్ర‌మ‌శిక్ష‌ణ అంతా పోయింది. షాట్ రెడీ అంటే క్యార‌వాన్ లో వున్న వాళ్లు వెంట‌నే వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అసిస్టెంట్ లు చెబితే వారు రావ‌డానికి ప‌దిహేను నిమిషాలు ప‌డుతోంది..దీని వ‌ల్ల న‌ష్ట‌మే జ‌రుగుతోంద‌న్నారు.

గిల్డ్ గురించి మాట్లాడుతూ .. గిల్డ్ ఒక చ‌రిత్ర‌. మ‌నీ ఎలా సేవ్ చేసుకోవాలనే ఆలోచ‌న‌తో యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ అనే దాన్ని మొద‌లు పెట్టాం. త‌ర్వాత అది దారి త‌ప్పింద‌ని ఊహించి మూసి వేశాం. ఆ త‌రువాత ర‌న్నింగ్ ప్రొడ్యూస‌ర్లే వుండాల‌ని గిల్డ్ ని ఫామ్ చేశాం.

దీనికి ప్ర‌ధాన కార‌ణం ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిలే. యాడ్స్‌ని వారి ద్వారానే ఇచ్చే వారు. బాడీలో యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్లే వుండాల‌న్న‌ప్పుడు ఎల‌క్ష‌న్ కు వెళ్లారు. నాకు పోటీగా రామ్మోహ‌న్ రావుని పెట్టారు. అది నాకు న‌చ్చ‌లేద‌న్నారు. గిల్డ్ లో మొత్తం 20 మంది యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ వున్నామ‌న్నారు.

ఇక హీరోల పారితోషికాల గురించి మాట్లాడుతూ స్టార్ హీరోల‌కు సినిమాకు 3 కోట్లు, మిడ్ రేంజ్ హీరోల‌కు ఒక‌టిన్న‌ర నుంచి రెండు కోట్లు.. చిన్న హీరోల‌కు 75 ల‌క్ష‌ల నుంచి కోటిన్న‌ర వ‌ర‌కు పెడ‌తాను. అంతా న‌న్నే ఫాలో అవుతారు. ఇర‌వై ఏళ్ల‌లో 50 సినిమాలు తీశాన‌ని. ప‌ని పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోతాన‌ని, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో త‌ప్ప తాను ఎవ‌రినీ క‌ల‌వ‌న‌ని, పొద్దున్నే ఐదింటికి లేస్తాను.. రాత్రి ప‌ది గంట‌ల‌కు ప‌డుకుంటాన‌న్నారు. అయితే అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌గా త‌న‌కు పేరు తెచ్చుకోవాల‌ని వుంద‌ని దిల్ రాజు త‌న మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.