Begin typing your search above and press return to search.

పూజ హెగ్డే లెగ్గుపెడితే సూపర్ హిట్టే: దిల్ రాజు

By:  Tupaki Desk   |   8 April 2022 11:00 PM IST
పూజ హెగ్డే లెగ్గుపెడితే సూపర్ హిట్టే: దిల్ రాజు
X
విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయన సినిమా వస్తుందంటే అక్కడ థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. ఆయన తాజా చిత్రంగా 'బీస్ట్' రూపొందింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా తెలుగు ప్రెస్ మీట్ ను కొంతసేపటి క్రితం నిర్వహించారు.

విజయ్ నెక్స్ట్ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ .. " ముందుగా దర్శకుడు నెల్సన్ గురించి మాట్లాడాలి. ఒక దర్శకుడు ఒక స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని, తాను అనుకున్న అవుట్ పుట్ తీసుకోవడమనేది చాలా టఫ్ జాబ్. నెల్సన్ గారు ఇంతకుముందు చేసిన 'కో కో కోకిల' .. ' డాక్టర్' సినిమాలను చూసుకుంటే, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఆయన ఎంచుకోవడం కనిపిస్తుంది. రెగ్యులర్ కథలను కాకుండా ఒక స్టార్ హీరోతో కమర్షియల్ అంశాలున్న కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తీసినందుకు ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి.

అనిరుధ్ కొత్తగా ఏం చేద్దామని ఆలోచించి అరబిక్ కుతు సాంగ్ చేశారు. ఈ రోజున ప్రపంచం మొత్తం ఈ పాటకు డాన్స్ చేస్తోంది. మా హిందీ 'జెర్సీ'కి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గొప్పగా చేశారు. ఇక పూజ విషయానికి వస్తే .. పూజ .. మన కాజా. ఆమె లెగ్గుపెడితే ఏ సినిమా అయినా సూపర్ హిట్టే. 'డీజే' .. 'మహర్షి' .. 'అల వైకుంఠపురములో' .. అన్నీ సూపర్ హిట్లే. ఇక 'బీస్ట్' కూడా ఆల్రెడీ సూపర్ హిట్ అన్నట్టే. ఆమె నెక్స్ట్ ఫిల్మ్ డేట్స్ నాకు కావాలని అడుగుతున్నాను. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో పూజ అంచలంచెలుగా ఎదుగుతోంది.

పూజ ఇప్పుడు మామూలు హీరోయిన్ కాదు .. ఆల్ ఇండియా హీరోయిన్ .. పాన్ ఇండియా హీరోయిన్. డాన్సుల పరంగానే కాదు .. సినిమా .. సినిమాకి ఆమె పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతూ పోతోంది. ఇక తెలుగులో ఉన్న సూపర్ స్టార్స్ తో నేను తీసిన సినిమాల సంగతి మీకు తెలిసిందే. అలాగే విజయ్ తో ఒక సినిమా చేయబోతున్నాను. విజయ్ ఒక స్టార్ హీరో .. అలాంటి ఆయన కేవలం రెండు సినిమాలను మాత్రమే తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ కి ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయం. ఈ నెల 13న వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాలను కోరుకుంటున్నాను " అంటూ చెప్పుకొచ్చారు.