Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ భామ రెమ్యూనరేషన్ కూడా అడగదట!!

By:  Tupaki Desk   |   26 July 2020 7:00 AM IST
సూపర్ స్టార్ భామ రెమ్యూనరేషన్ కూడా అడగదట!!
X
సౌత్ సినీ ఇండస్ట్రీలో మహానటి సినిమాతో తన నట విశ్వరూపాన్ని నిరూపించుకుంది కన్నడ భామ కీర్తిసురేష్. అప్పటి నుండి తను మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఇంకొంచెం ప్రత్యేకం అయింది. ఆ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రకు నిజంగానే ప్రాణం పోసింది కీర్తి. ఈతరం ప్రేక్షకులకు సావిత్రి అంటే కీర్తి సురేష్ మాత్రమే అనేంతలా జీవించేసింది. మహానటి తర్వాత కీర్తితో సినిమాలు చేయడానికి అన్నీ ఇండస్ట్రీల దర్శక నిర్మాతలు అందరూ క్యూ కట్టారు. ప్రస్తుతం కీర్తి మాత్రం కథల ఎంపికలో చాలా కేర్ తీసుకుంటుంది. మహానటి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కీర్తి నుండి సోలోగా పెంగ్విన్ సినిమా విడుదల అయింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా తర్వాత కీర్తి చేతిలో మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖీ.. సినిమాలు లైన్ లో ఉన్నాయి.

అయితే అమ్మడు రెమ్యూనరేషన్ విషయంలో సైలెంటుగా ఉంటుందని మహానటి నిర్మాత స్వప్నదత్ సోషల్ మీడియాలో తెలిపింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోను కీర్తి సురేష్ పోస్ట్ చేసింది. అలాగే ఓ కాప్షన్ జతచేసింది. 'మహానటి నిర్మాత స్వ‌ప్నాద‌త్‌ను చూసిన టైంలో చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. మేబి నా రెమ్యూనరేషన్ ముట్టినందువ‌ల్ల కావచ్చు" అంటూ తెలిపింది. ఇక కీర్తి పోస్టు పై స్వ‌ప్నాద‌త్ స్పందించి.. ‘ఈ క్రాక్ పిల్ల త‌న రెమ్యూనరేషన్ కూడా అడ‌గ‌దు’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటించడానికి కీర్తి ఓకే చెప్పింది. ఈ సినిమా కథ భారీ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో సాగుతుందని.. అందుల మహేష్ బ్యాంకు మేనేజరుగా నటిస్తుండగా.. కీర్తిసురేష్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించనుందట. బ్యాంకు మేనేజర్ - బ్యాంకు ఎంప్లాయి మధ్య లవ్ ట్రాకుతో పరశురామ్ ఈ సినిమా ప్లాన్ చేసినట్లు సమాచారం. చూడాలి మరి అమ్మడు మహేష్ సరసన ఎలా ఆకట్టుకుంటుందో..!