Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్స్.. అల్లూ రైట్ హ్యాండ్ సలహా

By:  Tupaki Desk   |   26 Aug 2017 6:25 PM IST
పవన్ ఫ్యాన్స్.. అల్లూ రైట్ హ్యాండ్ సలహా
X
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ పై ఎవ్వరైనా కామెంట్స్ చేస్తే పవన్ సైలెంట్ గా ఉన్నా ఆయన అభిమానులు మాత్రం అస్సలు ఊరుకోరు. ఎదో విధంగా వారికి గట్టి సమాధానం చెబుతారు. మీడియా అయినా సరే లేదా ఏ స్టార్ హీరో అయినా సరే పవన్ గురించి మాట్లాడకపోయినా పర్వాలేదు గాని నెగిటివ్ కామెంట్స్ చేస్తే మాత్రం అస్సలు సహించరు. అందుకు చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి.

అయితే ఇప్పుడు మరొక వ్యక్తి పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసి ఆయన అభిమానులకు కోపాన్ని తెప్పిస్తున్నాడు. ఒకప్పుడు అడపదడపా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ.. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా సినిమా అనలిస్ట్ గా మారాడు అతను. చాలా మందికి అతను బిగ్ బాస్ లో అడుగు పెట్టాకే అతను ఒక క్రిటిక్ అని తెలుసుకున్నారు. ఇకపోతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పవన్ పాలిటిక్స్ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దృష్టిలో విలన్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అతనిపై నిప్పులు చెరుగుతున్నారు పవన్ ఫ్యాన్స్. అతనికి ఫోన్ చేసి మరీ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారట. అయితే ఈ తరహాలో వివాదం చెలరేగుతుండడంతో అల్లు వారికి సన్నిహితుడు.. అరవింద్ రైట్ హ్యాండ్ గా పేరొంది.. అలాగే బలే బలే మగాడివోయ్- కొత్త జంట - 100% లవ్ సినిమాల సహా నిర్మాత బన్నీ వాసు ఈ విషయంపై స్పందించాడు.

"ఎవరికీ అంతగా తెలియని వ్యక్తుల గురించి మీ టైమ్‌ని.. ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. జనాలకు ఆ వ్యక్తులెవరో కూడా తెలియదు. అలాంటి వ్యక్తుల కామెంట్స్ కి మీరు రియాక్ట్ అయ్యి వారిని పాపులర్ చేయవద్దు. నేను కూడా ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని తప్పులను చేశాను కాబట్టి మీరు కూడా ఆలా చేయకండి'' అంటూ బన్నీవాసు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. మరి ఈ సలహాకి పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.