Begin typing your search above and press return to search.

బ్రాండ్ ఇమేజ్ కి బిగ్ డ్యామేజ్

By:  Tupaki Desk   |   14 April 2022 2:30 AM GMT
బ్రాండ్ ఇమేజ్ కి బిగ్ డ్యామేజ్
X
బ్రాండ్ ఇమేజ్.. దీనికి ఏ రంగంలో అయినా చాలా వ్యాల్యూ వుంటుంది. ద‌శాబ్దాల కాలం పాటు ఒకే రంగంలో వుంటూ ఆ రంగంలో త‌మ‌దైన ముద్ర వేయ‌డంతో వారికి ప్ర‌త్యేకంగా బ్రాండ్ ఇమేజ్ ఏర్ప‌డుతుంది. దాదాపు 40 ఏళ్లుగా ఎన్ని స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు వున్నా వారంద‌రికి భిన్నంగా అడుగులు వేస్తూ గీతాఆర్ట్స్ అంటే ఓ బ్రాండ్ అనే ఇమేజ్ ని క్రియేట్ చేశారు మాస్ట‌ర్ మైండ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌. తండ్రి స్వ‌ర్గీయ అల్లు రామ‌లింగ‌య్య వార‌స‌త్వంగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌వేశించిన ఆయ‌న త‌న సంస్థ తో మొద‌లై నేటి ట్రెండ్ కు అనుగునంగా సినిమాలు తీయ‌లేక ప్రొడ‌క్ష‌న్ నిలిపేసినా త‌ను మాత్రం ఇప్ప‌టికీ అదే బ్రాండ్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నారు.

యువ నిర్మాత బ‌న్నీవాసుతో క‌లిసి సినిమాలు నిర్మిస్తూ విజ‌యాల‌ని సాధిస్తున్నారు. ప‌ద‌కొండేళ్ల క్రితం భారీ ఫ్లాప్ ని ఎదుర్కొన్నా అప్ప‌టి నుంచి జాగ్ర‌త్త‌గా సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. చిన్న సినిమాల‌తో పాటు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ని అందిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల‌ని సొంతం చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం బ‌న్నీతో చేసిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తో క‌ల‌సి స‌హ భాగ‌స్వామ్యంలో నిర్మించారు.

గీతా ఆర్ట్స్ అంటే ఓ బ్రాండ్ వాల్యూ వుంది. ఈ సంస్థ నుంచి చిన్న సినిమా వ‌చ్చినా.. పెద్ద సినిమా వ‌చ్చినా ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి వుంటుంది. ఈ సంస్థ నుంచి వ‌చ్చే సినిమాల్లో ఏదో ఓ ప్ర‌త్యేక‌త వుంటుంద‌ని ప్రేక్ష‌కుల్లో ఓ ముద్ర ప‌డిపోయింది. అల్లు అర‌వింద్ స‌పోర్ట్ చేస్తూ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ నుంచి ఇప్ప‌టి వ‌రకు 7 సినిమాలొచ్చాయి. ఇందులో 99 శాతం హిట్లే వున్నాయి. ఇక మ‌రో రెండు రాబోతున్నాయి. ఈ రెండు కూడా సూప‌ర్ హిట్లే అనే టాక్ వుంది.

అయితే ఇంత ట్రాక్ రికార్డ్ వున్న అల్లు వారి బ్రాండ్ ఇమేజ్ కి తాజాగా బిగ్ షాక్ త‌గిలింది. ఒక విధంగా చెప్పాలంటే అ్లు వారి బ్రాండ్ ఇమేజ్ కి బిగ్ డ్యామేజ్ అయింది. కార‌ణం అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మించిన `గ‌ని`. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మైంది. బ‌న్నీ కెరీర్ విష‌యంలోనూ, గుడ్ స్టోరీస్ ని గీతా ఆర్ట్స్ ఎంచుకోవ‌డంలోనూ అల్లు బాబీ పేరు ప్ర‌ముఖంగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపించేది. అలాంటి వ్య‌క్తి నిర్మాత‌గా మారి సినిమా చేస్తున్నాడంటే అంతా ఆస‌క్తిగా ఎదురుచూశారు.

కానీ అనూహ్యంగా అల్లు బాబీ తొలి ప్ర‌య‌త్నంలోనే బిగ్ ఫ్లాప్ ఇస్తాడ‌ని ఊహించ‌లేక‌పోయార‌ట‌. ఈ సినిమాకు వ‌చ్చిన షేర్ ఇది ఏ స్థాయి డిజాస్ట‌రో స్ప‌ష్టం చేస్తోంది. 27 కోట్ల మేర షేర్ ని సాధించి బ్రేక్ ఈవెన్ కావాల్సిన ఈ సినిమా కేవ‌లం 3 కోట్ల షేర్ ని రాబ‌ట్టి సైలెంట్ అయిపోవ‌డం గీతా ఆర్ట్స్ వ‌ర్గాల‌తో పాటు ఇండ‌స్ట్రీ వారికి షాక్ కు గురిచేస్తోంది. `భీమ్లానాయ‌క్‌` కార‌ణంగా ప‌లు మార్లు ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డుతూ వచ్చింది. ఆ స‌మ‌యంలో అయినా జ‌రిగిన త‌ప్పేంటో తెలుసుకుని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం అల్లు అర‌వింద్ ఎందుకు చేయ‌లేద‌న్న‌ది ప్ర‌స్తుతం వినిపిస్తున్న వాద‌న.