Begin typing your search above and press return to search.

నేను 'పక్కా కమర్షియల్': బన్నీ వాసు

By:  Tupaki Desk   |   13 Jun 2022 4:52 AM GMT
నేను పక్కా కమర్షియల్: బన్నీ వాసు
X
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను బన్నీవాసు చూసుకుంటూ ఉంటాడు. ఒక కథను చెప్పేసి ఆయనను ఒప్పించడం చాలా కష్టమైన విషయం. ఏ కథ ఏ తరహా ఆడియన్స్ కి ఎక్కుతుందనే విషయం ఆయనకి బాగా తెలుసు.అలాగే ఏ కథకు ఏ హీరో సెట్ అవుతాడు .. ఆ ప్రాజెక్టుపై ఎంతవరకూ పెట్టొచ్చు అనే విషయంలో ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఆయన ఒప్పుకున్నాడంటే ఆ కథలో కొత్తదనం ఉన్నట్టే అని ఇండస్ట్రీలో అంతా నమ్ముతారు. ఆయనకి దర్శకుడు మారుతితో మంచి సాన్నిహిత్యం ఉంది.

ఇద్దరూ కలిసి చాలా సినిమాలకు కలిసి పనిచేశారు .. ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. అలా వాళ్లిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమానే 'పక్కా కమర్షియల్'. గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా ఈ సినిమా నిర్మితమైంది.

జూలై 1వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ .. "నిర్మాత పక్కా కమర్షియల్'గా లేకపోతే సినిమా వర్కౌట్ కాదు. అందువలన నేను పక్కా కమర్షియల్ అనే చెబుతాను.

ఒకప్పుడు థియేటర్లలో అల్లరి చేసే మేము ఇక్కడి వరకూ వచ్చాము. అప్పటి ఎనర్జీతోనే ఈ రోజున సినిమాలను నిర్మిస్తున్నాము. ఆడియన్స్ ఒక సినిమా నుంచి పూర్తి ఎంటర్టైన్మెంట్ ను కోరుకుంటారు. అలాంటి పూర్తిస్థాయి వినోదాన్ని అందించే సినిమా 'పక్కా కమర్షియల్' రూపొందింది.

గోపీచంద్ గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో రాశి ఖన్నా చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. ఇక దర్శకుడు మారుతి విషయానికి వస్తే ఆయన గురించి మాట్లాడవలసింది చాలా ఉంది. మున్ముందు చాలా ఫంక్షన్లు ఉన్నాయి .. అప్పుడు మాట్లాడతాను.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 26వ తేదీన ప్లాన్ చేశాము .. మళ్లీ అక్కడ కలుద్దాం. టిక్కెట్ల రేట్లు అందరికీ అందుబాటులోనే ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు. ఇక రాశి ఖన్నా మాట్లాడుతూ .. " ఫస్టు టైమ్ నేను ఈ సినిమాలో పూర్తిస్థాయి కామెడీ రోల్ చేశాను. ఈ సినిమాలో నేను హీరోయిన్ అయినప్పటికీ, కమెడియన్ స్థాయిలో నవ్విస్తాను. 'పక్కా కమర్షియల్' పక్కా ఎంటర్టైన్ మెంట్ అందిస్తుంది. జూలై 1వ తేదీన ఈ సినిమా వస్తుంది .. అంతా కూడా థియేటర్ కి వెళ్లి చూడండి" అని చెప్పుకొచ్చింది.