Begin typing your search above and press return to search.

నిర్మాత‌ పై హాటీ మందు బాటిల్ దాడి.. అస‌లేమైంది?

By:  Tupaki Desk   |   28 Dec 2019 7:03 AM GMT
నిర్మాత‌ పై హాటీ మందు బాటిల్ దాడి.. అస‌లేమైంది?
X
క‌న్న‌డ బ్యూటీ సంజ‌న గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ప‌రిచ‌యం చేసిన భామ‌ల్లో ఈ భామ కూడా ఉంది. బుజ్జిగాడు చిత్రంతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు హాట్ బాంబ‌ర్ గా పాపుల‌రైంది. హ‌ద్దుమీరిన‌ ఎక్స్ ఫోజింగ్ తో సంజూ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. న‌టిగా ఆశించినంత‌ స‌క్సెస్ కాక‌పోయినా.. నిరంత‌రం మీడియా అటెన్ష‌న్ ను మాత్రం త‌న‌ వైపే తిప్పేసుకోవ‌డం ఈ అమ్మ‌డికే చెల్లింది. క‌న్న‌డ‌- త‌మిళ‌- తెలుగు- మ‌ల‌యాళ భాష‌ల్లో నాయిక‌ గా న‌టించింది. తాజాగా ఈ అమ్మ‌డు ఓ నిర్మాత‌పై ఏకంగా మ‌ద్యం బాటిల్ తో దాడికి దిగింద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. మ‌రి ఆ దాడికి కార‌ణం ఏంటి? స‌ంజ‌న దాడిలో గాయ‌ ప‌డిన ఆ నిర్మాత ఎవ‌రు? అంటే..

ఆదివారం రాత్రి రిచ్ మండ్ టౌన్ లోని ఓ స్టార్ హోట‌ల్లో నిర్మాత వంద‌నా జైన్ తో సంజ‌న గొడ‌వ‌ప‌డింద‌ట‌. దీంతో స‌హ‌నం కోల్పోయిన సంజ‌న మ‌ద్యం బాటిల్ ని స‌ద‌రు నిర్మాత‌ పైకి విసిరిన‌ట్లు స‌మాచారం. దీంతో నిర్మాత‌కు స్వ‌ల్పంగా గాయ‌మైంద‌ట‌. దీంతో వంద‌నా న‌గ‌రంలోని క్ల‌బ్‌ పార్క్ స‌మీపం లోని పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి తాజాగా ఈ విష‌యం వెలుగు లోకి వ‌చ్చింది. అయితే ఈ ఘ‌ట‌న‌ లో పోలీసులు ఎఫ్ ఐఆర్ న‌మోదు చేయ‌కుండా రాజీ కుదిర్చే ప్ర‌య‌త్నం చేసారు. సీన్ సినీపెద్ద‌ల కోర్టుకు వెళ్ల‌డంతో రంగంలోకి దిగి ఇద్ద‌రి మ‌ధ్య పోలీసుల స‌మ‌క్షం లో రాజీ కుదిరిన‌ట్లు స‌మాచారం. తాజాగా ఈ ఘ‌ట‌న‌ పై సంజ‌న మీడియా కు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. వంద‌నా జైన్ తో గొడ‌వ జ‌రిగింది. కానీ అది చిన్న గోడ‌వే. ఇద్ద‌రి మ‌ధ్య చాలా కాలంగా సాన్నిహిత్యం ఉంద‌ని తెలిపింది.

గొడ‌వ అనంత‌రం హోటల్ లోనే రాజీ ప‌డ్డామ‌ని తెలిపింది. అయితే సంజ‌న వంద‌నా జైన్ ఆస్తుల‌ను టార్గెట్ చేసి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అత‌డికి 200 కోట్ల ఆస్తి ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేసింది. బెంగుళూరులో వంద‌నాకు ఎలాంటి వ్యాపారాలు.. కంపెనీలు లేవు.. కానీ 200 కోట్ల అక్ర‌మ‌ ఆస్తి ఉంద‌ని.. ముంబై లో రూ. 20 కోట్ల విలువ చేసే పెద్ద బంగ్లా ఉందని ఆరోపించింది. అలాగే బెంగుళూరు బ్రిగేడ్ రోడ్డు లో ఆస్తులున్నాయ‌ని ఇవ‌న్నీ ఎలా సంపాదించారో చెప్పాల‌ని డిమాండ్ చేసింది. అయితే మ‌ద్యం బాటిల్ తో దాడి చేసేంత త‌ప్పు స‌ద‌రు నిర్మాత ఏం చేసారు? అన్న వివ‌రాలు మాత్రం గోప్యం గా ఉంచింది. అలాగే ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న సంబంధం గురించి రివీల్ చేయ‌డానికి అయిష్ట‌త చూపించిన‌ట్లు స‌మాచారం.