Begin typing your search above and press return to search.

హీరోయిన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కి డేట్స్ ఇష్యూ రానుందా..?

By:  Tupaki Desk   |   1 Jun 2020 1:30 AM GMT
హీరోయిన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కి డేట్స్ ఇష్యూ రానుందా..?
X
సినీ ఇండస్ట్రీ కంటికి కనిపించని ఒక మహమ్మారి వలన ఎంతటి అవస్థలు పడుతుందో మనం చూస్తేనే ఉన్నాం. దీని మూలంగా రెండు నెలల నుండి సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టిప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి. సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు తమ రిలీజ్ తేదీలను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. దీని వలన నిర్మాతలు ఇంకా కష్టనష్టాలు అనుభవిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల మేర నష్టపోయిన నిర్మాతలు భవిష్యత్ లో అప్పుల్లో కూరుకుపోయే అవకాశాలున్నాయి. అయితే కొంతమంది నిర్మాతలు థియేటర్స్ ఇప్పట్లో పూర్వ వైభవాన్ని పొందలేవని భావించి తమ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కొన్ని రంగాలపై మినహాయింపులు ఇస్తూ వస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో షూటింగ్స్ జరుపుకోవచ్చని అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. ఇక తెలంగాణాలో కూడా కొన్ని షరతులతో జూన్ నుండి షూటింగ్స్ జరుపుకోవచ్చని చెప్పింది. ఆల్రెడీ కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టేసారు. షూటింగ్ లకు అనుమతులిచ్చిన వెంటనే చిత్రీకరణ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్స్ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీరికి కొత్త సమస్య వచ్చేలా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ప్రభుత్వం అనుమతులు వచ్చి షూటింగ్స్ స్టార్ట్ అయితే ఆ సినిమాల్లో నటించే హీరోయిన్స్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. హీరోలు అయితే ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఒక సినిమా చేసుకుంటూ వెళ్లే అవకాశం ఉంది. కానీ హీరోయిన్స్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ చాలా సినిమాలకి కమిట్ అయ్యుంటారు. దీని వలన వీరికి డేట్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితుల వలన ఆగిపోయిన సినిమాలకి ఇచ్చిన డేట్స్ ఆల్రెడీ వేస్ట్ అయ్యాయి. దీంతో వారు కమిట్ అయిన వేరే సినిమాకి డేట్స్ ఇబ్బంది రావచ్చు. ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ డేట్స్ ఇష్యూ వలన సినిమాలు వదులుకోవాల్సి వస్తోంది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అయితే ఎక్కువ సినిమాలకే కమిట్ అవుతుంటారు. మరి షూటింగ్స్ స్టార్ట్ అయితే వీరు అన్ని సినిమాలని ఎలా మేనేజ్ చేయబోతున్నారో చూడాలి. ఇప్పటికే షూటింగులు లేక చాలా నష్టపోయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ డేట్స్ ఇష్యూ వలన సినిమాలు వదులుకుంటే మరికొన్ని రోజులు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం దశల వారీగా షూటింగులకు అనుమతులిస్తామని చెప్తున్నా కొందరికి మాత్రం డేట్స్ విషయంలో ఖచ్చితంగా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో హీరోయిన్స్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో చూడాలి.